ACB RIDE: రెవెన్యూ కార్యాలయాలపై అనిశా దాడులు.. కీలక దస్త్రాలపై దృష్టి

author img

By

Published : Jul 20, 2021, 5:48 PM IST

mro offices

ఏపీ వ్యాప్తంగా వివిధ మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కీలక దస్త్రాలు స్వాధీనం చేస్తుకున్న అధికారులు.. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు.

ఏపీ వ్యాప్తంగా పలు తహసీల్దార్ కార్యాలయాలపై అనిశా ఆకస్మిక దాడులు(acb ride) నిర్వహించింది. కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్న అధికారులు.. కార్యాలయాల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఏకకాలంలో ఏసీబీ తనిఖీల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ మధ్యకాలంలో తహసీల్దార్​ కార్యాలయాల మీద పెద్ద సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

విశాఖ జిల్లాలో

జిల్లాలోని ఆరు రెవెన్యూ కార్యాలయాల్లో అనిశా తనిఖీలు చేస్తోంది. ఏసీబీ డీఎస్పీ షకీలాభాను నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి విశాఖ రూరల్, సీతమ్మధార, పెందుర్తి, అచ్యుతపురం, తదితర రెవెన్యూ​ ఆఫీసుల్లో దాడులు చేపట్టారు. కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగుల హాజరు పట్టికలను పరిశీలిస్తున్నారు. అలాగే రెవెన్యూ సేవలపై ఆరా తీశారు. కొద్దీ రోజుల క్రితమే భీమిలి రెవెన్యూ​ కార్యాలయంలో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఇంతలో నగరంలో చేపట్టిన ఏసీబీ సోదాలు చర్చనీయాంశమైంది.

విజయనగరం జిల్లాలో..

జిల్లాలో పలు తహసీల్దార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. భోగాపురం, డెంకాడ, జామి, కొత్తవలస, శృంగవరపుకోట, పూసపాటిరేగ రెవెన్యూ కార్యాలయాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. కార్యాలయం తలుపులు మూసి మరీ దస్త్రాలను పరిశీలించడంతో అధికారుల్లో అందోళన మొదలైంది. అప్పటికే కార్యాలయానికి వచ్చిన పలువురు రైతులు, స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

ఒక్కసారిగా పెరిగిన క్రయవిక్రయాలు..

భోగాపురంలో విమానాశ్రయంతో పాటు కారిడార్ మెట్రో రాకతో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో భూముల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. అలాగే కొత్తవలస, తదితర ప్రాంతాల్లో భూముల రేట్లు ఒక్కసారిగా పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారి లావాదేవీలన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లోనే గుట్టుచప్పుడుగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అనిశా దాడులు ముమ్మరం చేయడంతో సంబంధిత అధికారుల్లో వణుకు పుట్టింది.

ఇదీ చూడండి: high court: 'ప్రజల ప్రాణాలు పోతుంటే రోడ్ల మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.