ETV Bharat / city

husband killed his wife: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!

author img

By

Published : Dec 16, 2021, 12:45 PM IST

women murder: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!
women murder: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!

12:37 December 16

husband killed his wife: భార్యను ముక్కలుగా నరికి.. నగ్నంగా మార్చేసి..!

husband killed his wife: ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల సంచలనంగా మారిన ఓ గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మహిళ భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.

ఇదీ జరిగింది...

ఉత్తర్​ప్రదేశ్​లోని పన్వేల్​కు చెందిన పూనమ్ అనే మహిళకు రాంపాల్​ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. పూనమ్ స్థానికంగా ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్న వీరి కాపురంలో తర్వాత కలతలు రేగాయి. రాంపాల్​ తన భార్య పూనమ్ వేరొకరితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని పథకం పన్నాడు.

తన పథకం ప్రకారం గత ఆదివారం భార్య పూనమ్​ను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనుకున్నట్లుగానే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తల, ఓ చేతిని నరికేసి.. శరీరాన్ని నగ్నంగా మార్చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గుర్తుతెలియని మహిళ హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లాడ్జికి 50 కిలోమీటర్ల దూరంలో దొరికిన ఓ హ్యాండ్​బ్యాగ్​ సహకారంతో మృతురాలు పూనమ్​గా నిర్ధారించుకున్నారు. అనంతరం రాంపాల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు. ఫలితంగా అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

ఇదీ చూడండి: Jalleru Bus Accident: జల్లేరులో పడిన ఆర్టీసీ బస్సు.. 10 మంది జలసమాధి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.