Rythu Bandhu Funds: రూ.1047 కోట్ల రైతుబంధు నిధుల జమ.. 4.89 లక్షల మందికి లబ్ధి

author img

By

Published : Jan 3, 2022, 7:17 PM IST

Rythu Bandhu

Rythu Bandhu Funds: తెలంగాణలో గత ఐదురోజులుగా రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు సాయం రూ.5, 294.09 కోట్లు రైతుల ఖాతాల్లో జమైంది. 57,60,280 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరింది. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్ల రూపాయలు అందజేయడం.. వ్యవసాయ రంగం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అన్నారు.

Rythu Bandhu Funds: రాష్ట్రంలో రైతుబంధు పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. ఐదో రోజు.. 4,89,189 మంది రైతుల ఖాతాలో.. 1047.41 కోట్ల రూపాయల నగదు జమైంది. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5,294.09 కోట్లు పంపిణీ అయ్యాయి. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్ల రూపాయలు అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమని కొనియాడారు.

30 ఎకరాల రైతూ.. రేషన్​ బియ్యం కోసం ఎదురుచూసేవాడు: వ్యవసాయ శాఖ మంత్రి

తెలంగాణలో ఒకప్పుడు 20, 30 ఎకరాల భూమి ఉన్న రైతులూ రేషన్​ బియ్యం కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉండేదని రాష్ట్ర వ్యవసాయశాఖ‌ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో సాగు నీటి వసతి కల్పించారన్నారు. వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగం స్వరూపం మారిందని చెప్పారు. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్ల రూపాయలు.. రైతులకు అందజేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి ఈ పథకం నిదర్శనమని స్పష్టం చేశారు. రైతు బీమా, ఉచిత విద్యుత్​, సాగు నీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి.. రైతును నిలబెట్టామని చెప్పారు. రైతుబంధు వారోత్సవాల్లో ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల విజయాలను ప్రపంచానికి చాటాలని మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు.

ఇదీచూడండి: Rythu bandhu Celebrations: రాష్ట్రంలో ముందే సంక్రాంతి.. నేటి నుంచి రైతుబంధు సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.