ETV Bharat / business

Q3 త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన విప్రో.. లాభాల్లో 14% వృద్ధి.. డివిడెండ్​ ఎంతో తెలుసా?

author img

By

Published : Jan 13, 2023, 5:55 PM IST

దేశీయ ఐటీ రంగ సంస్థ విప్రో మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ3 త్రైమాసికంలో 2.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది. దాని విలువ రూ. 3,053 కోట్లుగా తెలిపింది.

wipro it company q3 net profit
wipro it company q3 net profit

ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మూడో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2.8 శాతం పెరిగి రూ.3,053 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.2,969 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే కంపెనీ నికర లాభం 14.3 శాతం పెరిగి.. రూ. 23,229 కోట్లకు చేరుకుందని తెలిపింది. అంచనాలకు మించి లాభాలను నమోదు చేసినట్లు విప్రో వివరించింది.

2023 మార్చి 31తో ముగిసే ఈ త్రైమాసికంలో వృద్ధి రేటు అంచనాను 0.6 నుంచి 1 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది కంపెనీ ఆదాయం 11.5 శాతం నుంచి 12 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో 4.3 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే తెలిపారు. కంపెనీ లాభాల బాట పట్టినందున ఈక్విటీ షేరుకు రూ.1 చొప్పున మధ్యంతర డివిడెండ్​ను ప్రకటించింది సంస్థ.

టీసీఎస్​ క్యూ3 ఫలితాలు..
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ క్యూ3 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 11 శాతం పెరిగినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 9769 కోట్లు లాభం రాగా.. క్యూ3లో రూ.10,846 కోట్లుగా నికర లాభం నమోదైనట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో ఒక్కో షేర్​పై రూ.75 డివిడెండ్​ ప్రకటించింది.

ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలు..
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను గురువారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడో త్రైమాసిక నికర లాభంలో 13.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ.5,809 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు ప్రకటించిన ఆ సంస్థ.. ఈ ఏడాది రూ.6,586 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.