ETV Bharat / business

మీ ఫోన్లో mAadhaar ఉందా? - ఈ యాప్​తో ఎన్నో ఉపయోగాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 4:52 PM IST

mAadhaar App Benefits : మీ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నంబర్​కు లింక్ అయి ఉందా? అయితే mAadhaar యాప్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దీనిలో మీరు రిజిస్ట్రర్ అయి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారంటే చాలు.. ఆధార్ అప్​డేట్​తో మొదలుకొని లాకింగ్ వరకు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇంతకీ ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

mAadhaar App Benefits
mAadhaar App Benefits in telugu

mAadhaar App Benefits : ప్రస్తుతం దేశంలో ఎలాంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్, ఓటర్ ఐడీ, సిమ్​ కార్డు.. ఇలా ఏది తీసుకోవాలనుకున్నా.. ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇంతటి విలువైన ఆధార్(Aadhaar) దుర్వినియోగం కాకుండా ఉండేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI).. mAadhaar అనే మొబైల్ యాప్​ను తీసుకొచ్చింది. అయితే.. చాలా మందికి ఈ యాప్ గురించి తెలియదు. మనకు ఒక్కోసారి ఆధార్ నంబర్ వివరాలు అత్యవసరం అవుతాయి. ఆ టైమ్​లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదొక్కటే కాదు ఈ యాప్​తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ mAadhaar యాప్​లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

UIDAI ప్రకారం.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తమ ఆధార్‌ను లింక్ చేసిన వ్యక్తులు మాత్రమే దీనిని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ ఇన్​స్టాల్ చేసుకున్న తర్వాత.. అందులో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి అవసరమయ్యే ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు వస్తుంది. ఆండ్రాయిడ్, iOS ఫోన్‍‌లలోనూ ఈ యాప్​ను పొందవచ్చు.

mAadhaar యాప్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోండిలా..

  • ముందుగా మీరు ఫోన్​లో mAadhaar యాప్‌ డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దానిని ఓపెన్ చేసి ఎగువన 'రిజిస్టర్ ఆధార్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ ప్రొఫైల్​ను యాక్సెస్ చేయడానికి 4 అంకెల పాస్​వర్డ్​ను క్రియెట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఓటీపీని అందుకుంటారు.
  • OTP అక్కడ నమోదు చేసి Submit బటన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ ప్రక్రియ విజయవంతం అవుతుంది. మీ ప్రొఫైల్ రిజిస్టర్ అవుతుంది.
  • చివరగా.. దిగువ మెనూలో 'My Aadhaar' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీ పాస్​వర్డ్ ఎంటర్ చేసి నావిగేట్ అవ్వాలి.
  • అంతే.. మీ ఆధార్ నంబర్ యాప్​తో లింక్ అవుతుంది. తర్వాత ఫోన్​లోకి మీ ఆధార్ కార్డు వచ్చేస్తుంది.

ఫింగర్​ ప్రింట్స్​ లేకున్నా ఐరిస్​తో ఆధార్​ జారీ- కేంద్రం కీలక నిర్ణయం

mAadhaar యాప్ ప్రయోజనాలు :

  • ఇలా మొబైల్​లో mAadhaar యాప్​లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారంటే.. ఈ యాప్ ద్వారా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి.
  • ఆధార్ వివరాలు, చిరునామా, QR కోడ్ వంటి సమాచారాన్ని త్వరగా సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ యాప్ వీలు కల్పిస్తుంది.
  • మీరు మీ ఆధార్ వివరాలను ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా చూడవచ్చు.
  • ఈ యాప్​ మీ ఫోన్​లో ఉంటే ఫిజికల్ ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
  • ఒక స్మార్ట్‌ఫోన్‌లో గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ సమాచారాన్ని నిల్వ చేయవచ్చు.
  • గుర్తింపు ధ్రువీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మీరు eKYC (నో యువర్ కస్టమర్) లేదా QR కోడ్‌లను సర్వీస్ ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు.
  • అదనపు రక్షణ కోసం బయోమెట్రిక్‌ అందుబాటులో ఉంటుంది.
  • అలాగే మీ ఆధార్ వివరాలను బయోమెట్రిక్ డేటా ద్వారా కూడా లాక్ చేయవచ్చు. అదేవిధంగా అన్ లాక్ చేయవచ్చు.
  • ఇవే కాదు ఈ యాప్ ద్వారా ఆన్​లైన్​లో మీ ఆధార్ అప్​డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్​డేట్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చూసుకోవచ్చు.

మీ పిల్లలకు ఆధార్​ కార్డు ఉంది సరే - మరి "అపార్"​ కార్డు ఉందా?

ఆన్​లైన్ ఫ్రాడ్స్ నుంచి రక్షణ పొందాలా?.. ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.