ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​లో 'బుల్​'రన్​.. ఐటీ, ఆర్థిక షేర్ల జోష్​.. సెన్సెక్స్​ 870 ప్లస్​

author img

By

Published : Apr 21, 2022, 2:55 PM IST

Updated : Apr 21, 2022, 3:51 PM IST

Stock Market LIVE Updates, Sensex climbs 800 points
Stock Market LIVE Updates, Sensex climbs 800 points

14:47 April 21

దలాల్​ స్ట్రీట్​లో 'బుల్​'రన్​.. ఐటీ, ఆర్థిక షేర్ల జోష్​.. సెన్సెక్స్​ 870 ప్లస్​

Stock Market LIVE Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లోనూ భారీ లాభాలను నమోదుచేశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 874 పాయింట్ల లాభంతో.. 57 వేల 912 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 256 పాయింట్లు పెరిగి.. 17 వేల 393 వద్ద సెషన్​ను ముగించింది. ఓ దశలో సెన్సెక్స్​ 950పాయింట్లకుపైగా పెరగడం విశేషం.

  • ఐచర్​ మోటార్స్​, కోల్​ ఇండియా, ఎం అండ్​ ఎం, అదానీ పోర్ట్స్​, మారుతీ సుజుకీ, రిలయన్స్​ షేర్లు రాణించాయి. సిప్లా, టాటా స్టీల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఓఎన్​జీసీ, హిందాల్కో, నెస్లే డీలాపడ్డాయి. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ సానుకూలంగా కదలాడుతున్నాయి. బ్యాంకింగ్​, ఆటో, ఫార్మా, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
  • బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఒక శాతం మేర పుంజుకున్నాయి.
  • ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్​, ఐటీ షేర్లు పుంజుకోవడం మార్కెట్ల దూకుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు వ్యాపార నిపుణులు. ముఖ్యంగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేరు విలువ.. 2788.80 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. గురువారం సెషన్​లో ఈ షేరు 2 శాతానికిపైగా పెరగడం విశేషం.
  • ఆటో, ఐటీ, ఫార్మా సూచీలు ఒక శాతం మేర మెరుగుపడ్డాయి. నాలుగో త్రైమాసికంలో ఐటీ షేర్లు మంచి ఫలితాలను ప్రకటించవచ్చని వెలువడిన అంచనాలు మదుపరుల్లో ఉత్సాహం నింపాయి.
  • అమెరికా మార్కెట్లు మిశ్రమంగా స్పందించినా.. ఆసియా సూచీలు దూసుకెళ్లాయి. నిక్కీ, కోస్పీ, సియోల్​ సూచీలు లాభాల్లో ఉండగా.. షాంఘై, హాంగ్ సెంగ్​​ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
  • 5 వరుస సెషన్ల నష్టాల నుంచి కోలుకున్న స్టాక్​ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. సెన్సెక్స్​ 574, నిఫ్టీ 178 పాయింట్ల మేర పెరిగాయి.

ఇవీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మెరుగుపడిన బిట్​ కాయిన్

స్టార్టప్​లకు మైక్రోసాఫ్ట్‌ సహకారం.. కృత్రిమ మేధ అభివృద్ధి చేసుకునేలా

Last Updated :Apr 21, 2022, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.