ETV Bharat / business

కొన్ని షేర్లకే పరిమితం కావొద్దు.. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కింగ్ మీరే!

author img

By

Published : May 30, 2023, 7:37 AM IST

Stock Investment Tips : చాలా కాలంగా పెట్టుబడి విధానాలు మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజ్‌ విధానం చుట్టే కేంద్రీకృతం అయ్యాయి. ఎక్కువ 'ఫ్రీ ఫ్లోట్‌ 'మార్కెట్‌ కేపిటలైజేషన్‌'' ఉన్న షేర్లకు ఈ విధానంలో అధిక వెయిటేజీ ఉంటుంది. కానీ ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు దీనికి భిన్నంగా సూచీల్లోని అన్ని షేర్లకు సమానమైన వెయిటేజీని అందిస్తాయి. దీంతో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.

tips-for-investment-in-share-market-and-equal-weighted-index-funds-in-india
ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు

Stock Investment Tips : సూచీల్లోని (ఇండెక్స్‌) ప్రతి షేర్​కూ సమాన ప్రాధాన్యం ఇవ్వటమనేది ఈక్వల్లీ వెయిటెడ్‌ విధానంలో వినూత్నమైన అంశంగా చెప్పుకోవచ్చు. భారత్​లో ఎక్కువ ఆదరణం ఉన్న నిఫ్టీ 50 ఇండెక్స్‌కు వర్తింపచేస్తే.. పెట్టుబడులపై అనూహ్యమైన ప్రతిఫలం లభిస్తుంది. దీనివల్ల ఎన్నో పరీక్షలకు తట్టుకొని నిలిచిన ఎంతో బలమైన కంపెనీలపై ఇన్వెస్ట్​ చేస్తే లభించే ప్రయోజనాలను పొందడం, దాంతోపాటు అధిక ఫ్రీ-ఫ్లోట్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఉన్న కొన్ని అప్రధాన కంపెనీలకు ఎక్కువ పెట్టుబడులను మళ్లించి నష్టపోయే పరిస్థితిని నివారించినట్లు అవుతుంది. కొన్ని షేర్లలోనే మదింపులను కేంద్రీకరించటం లేదా రెండు మూడు రంగాలకు అధికంగా పెట్టుబడులు కేటాయించటాన్ని కూడా అదుపు చేయవచ్చు.

రుజువైన విధానం..
ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ అనే పెట్టుబడి విధానం మొదటి సారిగా అమెరికాలో 'ఎస్‌అండ్‌పీ 500 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌'తో 2000 సంవత్సరంలో మొదలైంది. ఆ తర్వాత మిగతా అన్ని దేశాల్లో దీన్ని అనుసరించారు. భారత్​లో 2017లో నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఆధారంగా మొదటి ఫండ్‌ వచ్చింది. గత కొన్నేళ్లుగా చూస్తే, ఎస్‌అండ్‌పీ 500 తో పాటు ఇతర ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌లు దీర్ఘకాలంలో మార్కెట్‌ కేపిటలైజేషన్‌ వెయిటేజ్‌ ఆధారిత ఫండ్ల కంటే మెరుగైన లాభాలను సంపాదించాయి. అదే విధంగా నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిటెడ్‌ ఇండెక్స్‌ దీర్ఘకాలంలో, నిఫ్టీ 50 ఇండెక్స్‌ కంటే ఏడాదికి సగటున రెండు శాతం ఎక్కువ ప్రతిఫలాన్ని నమోదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.

స్వల్పకాలిక ఫలితాలను విశ్లేషిస్తే.. గత 23 ఏళ్ల కాలంలో 14 ఏళ్లలో నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఎక్కువ పనితీరును ప్రదర్శించింది. ఇంకా చూస్తే- స్టాక్‌మార్కెట్లో 'డీపోలరైజేషన్‌' ధోరణి ఉన్న కాలంలో ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఇంకా అధిక ప్రతిఫలాన్ని నమోదు చేసిన విషయం గమనార్హం. మార్కెట్లో కేంద్రీకృత ధోరణి ఉన్నప్పుడు, ఇండెక్స్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న షేర్లు లాభపడతాయి. కానీ డీపోలరైజేషన్‌ సమయంలో అన్ని షేర్ల ధరలు పెరుగుతాయి. అందువల్ల 'డీపోలరైజేషన్‌' సందర్భాల్లో ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ పథకాలు అట్రాక్టివ్​గా మారతాయి. 2009లో వచ్చిన అతిపెద్ద ఆర్థిక మాంద్యం అనంతరం, తదుపరి 2020లో కొవిడ్‌- 19 తర్వాత స్టాక్‌ మార్కెట్లో వచ్చిన ర్యాలీల్లో ఇదే దోరణి కనిపించింది. ​

మిశ్రమ పెట్టుబడులు...
Mixed Investment Funds : మీరు మీ మదింపు విలువను బహుముఖంగా పెంచుకోవాలనుకుంటే.. 2 ప్రాథమిక పెట్టుబడి సూత్రాలను అనుసరించాలి. అవి- మెయిన్​ కంపెనీల షేర్లపై ఇన్వెస్ట్​ చేయడం, వివిధ రంగాలకు చెందిన విభిన్నమైన కంపెనీలను ఎంపిక చేసుకోవటం. ఈ విధానం, మార్కెట్‌ క్యాప్‌ ఇండిసిస్‌ ఆధారిత పెట్టుబడుల విధానం కంటే మేలుగా ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడి వ్యయం కూడా తక్కువగా ఉంటుంది.

Equal Weighted Index Funds : కార్పొరేట్‌ ట్రెజరీలు, ఎగ్జంప్ట్‌ పీఎఫ్‌ ట్రస్ట్‌లు వంటి సంస్థాగత మదుపరులకు ఈక్వల్‌ వెయిటెడ్‌ విధానమే మేలని చెప్పవచ్చు. మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజ్‌ పద్ధతి కంటే తక్కువ రిస్కు, అధిక ప్రతిఫలం ఈ విధానంలో ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యము కూడా ఉంటుంది. అంతేగాక 'ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌' ఎంతో సులువని చెప్పవచ్చు. ఇది ఎంతో మేలైన పెట్టుబడి విధానం కూడా. అందువల్ల ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండటం తప్పనిసరని చెప్పవచ్చు.

  • ఈక్వల్‌ వెయిట్‌ విధానం ఒకే ఒక మూల సూత్రాన్ని ఫాలో అవుతుంది. మీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని షేర్ల ధరలు పెరగాలి, దీంతో మీరు లాభపడాలి, తద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలి- ఇదే ఈ విధానంలోని గొప్పతనంగా చెప్పవచ్చు. ఈ సూత్రాన్ని పాటించటం ద్వారా మీరు నిర్దేశించుకున్న పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
  • ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు దీర్ఘకాలంలో సంపద సృష్టించటమే లక్ష్యంగా మదింపుల్లో సమతౌల్యాన్ని పాటిస్తాయి. అదే విధంగా కేంద్రీకృత పెట్టుబడులను నివారిస్తాయి. ఒక ఇండెక్స్‌లోని అన్ని షేర్లకు సమానమైన ప్రాధాన్యాన్ని ఇస్తాయి. దీంతో నష్టభయాన్ని తగ్గించుకుంటాయి.
  • నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌, చాలా ఏళ్లుగా నిఫ్టీ 50 ఇండెక్స్‌ను మించిన ప్రతిఫలాన్ని నమోదు చేస్తూ వస్తోంది. 1999 నుంచి 2022 వరకు కూడా నిఫ్టీ 50 కంటే, నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌, సగటున రెండు శాతం ఎక్కువ వార్షిక ప్రతిఫలాన్ని ఇచ్చింది.
  • ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు, స్టాక్‌మార్కెట్‌ స్థితిగతుల ఆధారంగా వివిధ సందర్భాల్లో భిన్నమైన పనితీరును కనబరుస్తాయి.
  • మదుపరుల పోర్ట్‌ఫోలియోలో ఈక్వల్లీ వెయిటెడ్‌ ఇండెక్స్‌ ఫండ్లు చేర్చటం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్‌ ట్రెజరీలు, ఎగ్జంప్ట్‌ పీఎఫ్‌ ట్రస్ట్‌లు వంటి సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు తప్పనిసరి. మార్కెట్‌ క్యాప్‌ వెయిటేజీ ఆధారిత పెట్టుబడుల విధానం కంటే మెరుగైనది. రిస్కును తగ్గించుకోవటానికి, లాభాలు పెంచుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది.
  • 'ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌' ఎంతో సులువైన ప్రక్రియ. అదే సమయంలో ఎంతో మేలైన పెట్టుబడి విధానం కూడా. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండటం తప్పనిసరి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.