ETV Bharat / business

SBI Net Profit : స్టేట్ బ్యాంక్​ లాభాలు డబుల్​.. 3 నెలల్లోనే రూ.17వేల కోట్ల ప్రాఫిట్​

author img

By

Published : Aug 4, 2023, 1:57 PM IST

Updated : Aug 4, 2023, 3:29 PM IST

SBI Standalone Net Profit June 2023 : స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 2023 జూన్​ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.16,884 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ లాభం రెండు రెట్లు అని తన రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది.

SBI standalone net profit at Rs 16884 crore
sbi net profit 2023

SBI Standalone Net Profit : భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ ఈ ఏడాది భారీ లాభాలను నమోదు చేసింది. 2023 జూన్​ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.16,884 కోట్ల స్టాండ్​అలోన్​ నెట్​ ప్రాఫిట్​ను సంపాదించింది. ఇది గతేడాదితో పోల్చితే రెండు రెట్లు లాభం కావడం విశేషం. 2022-23 ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో ఎస్​బీఐ స్టాండ్​అలోన్​ నెట్​ ప్రాఫిట్​ కేవలం రూ.6,068 మాత్రమే. వాస్తవానికి మొండి బాకాయిలు తగ్గుముఖం పట్టడం, రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం మెరుగుపడడమే ఎస్​బీఐ లాభాలకు కారణం.

లాభాలు రెట్టింపు!
SBI Consolidated Profit : ఎస్​బీఐ ఏకీకృత లాభం కూడా దాదాపు రెండు రెట్లు పెరిగింది. గతేడాది ఏప్రిల్​-జూన్​ మాసాల్లో ఎస్​బీఐ కన్సాలిడేటెడ్​ ప్రోఫిట్​ రూ.7,325 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం అది రూ.18,537 కోట్లకు పెరిగింది. తాజాగా ఎస్​బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్​లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఎస్​బీఐ మొత్తం లాభం
SBI Total Income : 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా మొత్తం ఆదాయం రూ.74,989 కోట్లు, కానీ ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్​బీఐ మొత్తం ఆదాయం ఏకంగా రూ.1,08,039 కోట్లకు చేరింది.

వడ్డీ ఆదాయం పెరిగింది!
SBI Interest Income : ఈ ఏడాది ఎస్​బీఐకు వడ్డీ ఆదాయం రూ.95,975 కోట్లు వచ్చింది. గతేడాది ఈ ఇంట్రెస్ట్​ ఇన్​కం కేవలం రూ.72,676 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

నిరర్థక ఆస్తులు (NPA)
SBI Non performing Assets (NPA) : ఎస్​బీఐ స్థూల నిరర్థక ఆస్తులు (NPA) జూన్​ చివరి నాటికి 2.76 శాతానికి పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో ఎస్​బీఐ ఎన్​పీఏలు 3.91 శాతంగా ఉన్నాయి. అదే విధంగా నికర ఎన్​పీఏలు కూడా 2023 జూన్​లో 0.71 శాతానికి తగ్గాయి. గతేడాది ఈ నికర ఎన్​పీఏలు దాదాపు 1 శాతం వరకు ఉండేవి.

ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​!
SBI General Insurance : 2023 జూన్​ త్రైమాసికంలో ఎస్​బీఐ తన నాన్​-లైఫ్ ఇన్సూరెన్స్ వెంచర్​.. జనరల్ ఇన్సూరెన్స్​లో రూ.489.67 కోట్లను ఇన్​ప్యూజ్​ చేసింది. ముఖ్యంగా 8 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB)ల్లో రూ.82.16 కోట్లను జమ చేసినట్లు స్పష్టం చేసింది.

Last Updated : Aug 4, 2023, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.