ETV Bharat / business

SBI Locker Charges : ఎస్​బీఐ లాకర్ కొత్త​ రూల్స్, ఛార్జీలు తెలుసా? బ్యాంక్​కు వెళ్లి సైన్ చేయడం మస్ట్!

author img

By

Published : Jul 3, 2023, 2:10 PM IST

Updated : Jul 3, 2023, 2:34 PM IST

SBI Locker Charges Hike : దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ లాకర్ సేవల నిబంధనల్ని ఇటీవల మార్చింది. అలాగే లాకర్​ ఛార్జెస్​ను కూడా సవరించింది. పూర్తి వివరాలు మీ కోసం.

SBI Issues New Guidelines For Locker Holders Check Revised Charges Here
SBI Locker Charges Hike

SBI Revised Locker Charges : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) కస్టమర్లకు అలర్ట్​. ఆర్​బీఐ నిర్దేశం మేరకు.. ఎస్​బీఐ ఇటీవల లాకర్​ నిబంధనల్లో మార్పులు చేసింది. అందువల్ల లాకర్​ హోల్డర్లు.. తమ బ్రాంచ్​లకు వెళ్లి, న్యూ లాకర్​ అగ్రిమెంట్​పై సంతకాలు చేయాలని కొద్దిరోజుల క్రితం ఎస్​బీఐ సూచించింది.

డిసెంబర్​ ఆఖరులోగా..
దేశంలోని బ్యాంకులు అన్నీ తమ లాకర్​ అగ్రిమెంట్​ను అప్​డేట్​ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా ఇటీవల ఆదేశించింది. సెప్టెంబర్​ 30 నాటికి 75 శాతం మంది, డిసెంబర్​ 31లోగా పూర్తిగా 100 శాతం లాకర్​ హోల్డర్లు ఈ రివెజ్డ్​/ సంప్లిమెంట్​ లాకర్​ అగ్రిమెంట్​పై సంతకాలు చేసి తీరాలని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

లాకర్​ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
SBI New Locker Charges : లాకర్​ సైజు, అది ఉన్న ప్రదేశం ఆధారంగా​ ఛార్జీలు మారుతూ ఉంటాయని ఎస్​బీఐ కస్టమర్లు గుర్తించాలి. చిన్న, మధ్య స్థాయి లాకర్లపై జీఎస్​టీతో సహా రూ.500 వరకు రుసుము వసూలు చేస్తారు. పెద్ద లాకర్ల విషయంలో రూ.1000 రిజిస్ట్రేషన్​ ఛార్జ్ సహా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రదేశం,​ సైజును అనుసరించి లాకర్​ రెంట్ ఛార్జీలు

  • అర్బన్​, మెట్రో నగరాల్లోని ఎస్​బీఐ కస్టమర్లు చిన్న లాకర్ల అద్దె కింద రూ.2000 తోపాటు జీఎస్​టీ చెల్లించాలి.
  • చిన్న నగరాలు, గ్రామీణ​ ప్రాంతాల్లో చిన్న​ లాకర్​కు రూ.1500తో పాటు జీఎస్​టీ కూడా చెల్లించాలి.
  • మీడియం సైజు లాకర్ల విషయానికి వస్తే అర్బన్, మెట్రో నగరాల్లో రూ.4000 + జీఎస్​టీ చెల్లించాలి.
  • చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మీడియం సైజు లాకర్లకు రూ.3000, అదనంగా జీఎస్​టీ కట్టాలి.
  • ప్రధాన నగరాల్లో పెద్ద సైజు లాకర్లు తీసుకునే వారు రూ.8000+ జీఎస్​టీ చెల్లించాలి.
  • చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సైజు లాకర్ల అద్దె కింద రూ.6000+ జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది.
  • మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో చాలా పెద్ద లాకర్​ సదుపాయం వాడుకునేవారు రూ.12,000తోపాటు జీఎస్​టీ చెల్లించాలి.
  • చిన్న పట్టణాలు, గ్రామీణ​ ప్రాంతాల్లో చాలా పెద్ద లాకర్​ను తీసుకుంటే రూ.9000తో పాటు జీఎస్​టీ కట్టాల్సి ఉంటుంది.
Last Updated :Jul 3, 2023, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.