ETV Bharat / business

SBI Fixed Deposit Rates 2023 : ఎస్​బీఐ వీ కేర్​ Vs అమృత్​ కలశ్​.. ఏది బెస్ట్ ఆప్షన్​?

author img

By

Published : Aug 11, 2023, 1:52 PM IST

SBI Fixed Deposit Rates 2023 : ఎస్​బీఐ రెండు స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్​ స్కీమ్​లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఎస్​బీఐ వీ కేర్'​, 'ఎస్​బీఐ అమృత్ కలశ్​' పేరుతో తీసుకొచ్చిన ఈ పొదుపు పథకాల్లో అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తోంది. మరి వీటి పూర్తి వివరాలు మనం కూడా తెలుసుకుందామా?

SBI Wecare vs SBI Amrit Kalash
SBI fixed deposit rates 2023

SBI Fixed Deposit Rates 2023 : ప్రభుత్వరంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ).. రెండు పరిమిత కాల స్పెషల్ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​లను తీసుకొచ్చింది. వీటిలో 'ఎస్​బీఐ అమృత్ కలశ్​' పథకాన్ని ఆగస్టు 15లోపు సబ్​స్క్రైబ్​ చేసుకోవాల్సి ఉంటుంది. 'ఎస్​బీఐ వీ కేర్'​ స్కీమ్​లో 2023 సెప్టెంబర్​ 30లోపు చేరాల్సి ఉంటుంది. మరి ఈ రెండు స్కీమ్స్​లో ఏది బెటర్​ ఆప్షన్​ అవుతుందో ఇప్పుడు చూద్దామా?

ఎస్​బీఐ ఫిక్స్​డ్ డిపాజిట్స్ - వడ్డీ రేట్లు
SBI FD Interest Rates 2023 : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధితో ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ చేయవచ్చు. వీటిపై 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ రేట్లు లభిస్తాయి. సాధారణంగా ఈ ఎఫ్​డీల్లో పొదుపు చేసిన సీనియర్​ సిటిజన్స్​కు, మిగిలిన వారి కంటే 50 బేసిస్​ పాయింట్లు వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతమున్న ఎస్​బీఐ వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూాద్దాం..

ఎస్​బీఐ ఫిక్స్​డ్ డిపాజిట్స్​వడ్డీ రేట్లు
7 రోజులు - 45 రోజులు3%
46 రోజులు - 179 రోజులు4.5%
180 రోజులు - 210 రోజులు5.25%
211 రోజులు - ఒక సంవత్సరం లోపు5.75%
1 సంవత్సరం - 2 సంవత్సరాలు లోపు6.8 %
2 సంవత్సరాలు - 3 సంవత్సరాల లోపు7%
3 సంవత్సరాలు - 5 సంవత్సరాల లోపు6.5%
5 సంవత్సరాలు - 10 సంవత్సరాలు6.5%
400 రోజులు (అమృత్​ కలశ్​ - స్పెషల్​ స్కీమ్​)7.10%

అమృత్​ కలశ్​ డిపాజిట్ స్కీమ్​​
SBI Amrit Kalash Scheme Details : ఎస్​బీఐ 2023 ఫిబ్రవరిలో 400 రోజుల వ్యవధి గల అమృత్​ కలశ్​ స్పెషల్​ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​ను ప్రవేశపెట్టింది. దీనిలో పొదుపు చేసిన సీనియర్​ సిటిజన్స్​కు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మిగతా వారికి 7.1 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2023 ఆగస్టు 15.

SBI Amrit Kalash Scheme Benefits : ఆదాయపన్ను చట్టం ప్రకారం, ఈ అమృత్​ కలశ్​ స్కీమ్​లో వచ్చిన ఆదాయంపై మూలం వద్ద టీడీఎస్​ పన్ను కోత ఉంటుంది. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్​ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి ఈ అమృత్​ కలశ్ పథకం మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ పథకంలో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ స్పెషల్​ ఫిక్స్​డ్ డిపాజిట్​లోని డబ్బును ముందుగానే ఉపసంహరించుకోవచ్చు.

వీ కేర్​ డిపాజిట్ స్కీమ్​
SBI We care Scheme Details : ఎస్​బీఐ.. సీనియర్ సిటిజన్స్​ కోసం ఈ 'వీ కేర్​' స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​ను తీసుకొచ్చింది. ఈ పథకంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన సీనియర్​ సిటిజన్స్​కు 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గడువును ఎస్​బీఐ మరోసారి పెంచింది. అందువల్ల ఈ స్కీమ్​లో 2023 సెప్టెంబర్​ 30లోగా చేరాల్సి ఉంటుంది. ఈ పథకంలో కొత్తవారు చేరవచ్చు. అలాగే ఇప్పటికే ఈ స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్​ మెచ్యూరిటీ పొందినవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.