'ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నా.. భారత్ మాత్రం సేఫ్'

author img

By

Published : Nov 20, 2022, 3:40 PM IST

no-prospect-of-recession-in-india-says-rajiv-kumar/

ప్రపంచం మొత్తం ఆర్థికమాంద్యంలో చిక్కుకున్నాసరే.. భారత్​లో మాత్రం ఆ పరిస్థితి రాదని నీతి ఆయోగ్​ వైస్​ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. అయితే భారత వృద్ధిరేటుపై కొంతమేర ప్రభావం ఉంటుందని అన్నారు.

భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌-ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 2023-24లో దేశం 6-7 శాతం ఆర్థిక వృద్ధిని.. నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం.. మాంద్యంలోకి జారుకున్నా భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని.. రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకుంటుందన్నారు. కానీ.. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు.

అయితే, వృద్ధిరేటుపై మాత్రం కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చన్నారు రాజీవ్. అయినా 2023- 24లో 6-7 శాతం వృద్ధి నమోదవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం మరికొంత కాలం 6-7 శాతం మధ్య ఉంటుందని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ధరల పెరుగుదల ముఖ్యంగా చమురు ధరలపై వృద్ధిరేటు ఆధారపడి ఉంటుందన్నారు. రూపాయి పతనంపై స్పందిస్తూ.. భారత్‌లో దిగుమతి చేసుకున్న వస్తు- సేవలను సామాన్యులు ఎక్కువగా ఉపయోగించరని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.