ETV Bharat / business

బిర్యానీ గురించి 'గొడవ'.. సారీ చెప్పించిన సత్య నాదెళ్ల

author img

By

Published : Jan 5, 2023, 1:24 PM IST

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల బిర్యానీ కోసం వాగ్వాదానికి దిగారు. బిర్యానీని అలా అని తనను అవమానించొద్దని అన్నారు. అనంతరం సారీ చెప్పించారు. మరోవైపు.. భారత పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోదీని గురువారం కలిశారు.

satyanadella ChatGPT biryani
satyanadella ChatGPT biryani

దిగ్గజ సాఫ్ట్​వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​, సీఈఓ సత్య నాదెళ్ల ఓ చాట్​బాట్​తో 'గొడవ'కు దిగారు. అనంతరం దాంతో సారీ కూడా చెప్పించారు. ఇదంతా బిర్యానీ కోసం జరిగింది. బెంగళూరులో జరిగిన ఫ్యూచర్​ రెడీ టెక్నాలజీ సమావేశం​లో మాట్లాడిన నాదెళ్ల.. చాట్​జీపీటీ(ChatGPT) అనే చాట్​బాట్​తో తనకు జరిగిన సంభాషణ గురించి చెప్పారు. అనంతరం భారత్​లో జరుగుతున్న అత్యాధునిక కృత్రిమ మేధ(AI), క్లౌడ్​ కంప్యూటింగ్(Cloud Computing)​ ఆవిష్కరణలపై ప్రెజంటేషన్​ ఇచ్చారు.

బిర్యానీ కోసం గొడవ..
ప్రెజంటేషన్​ ఇవ్వడానికి మందు.. ఆయన సమావేశానికి వచ్చిన వారితో మాట్లాడారు. అనంతరం, చాట్​జీపీటీ చాట్​బాట్​తో తనకు జరిగిన సంభాషణ విశేషాల్ని వారికి చెప్పారు. దాని ప్రకారం.. సౌత్​ ఇండియాలో పాపులర్​ టిఫిన్స్​ లిస్ట్​ చెప్పమని చాట్​జీపీటీ చాట్​బాట్​ను ఓ సారి సత్య నాదెళ్ల అడిగారు. ఆ బాట్ ఒక లిస్ట్​ ఇచ్చింది. అందులో ఇడ్లీ, దోశ, వడతో పాటు బిర్యానీని కూడా కలిపింది. దీంతో సత్య నాదెళ్ల కోపోద్రిక్తుడై.. బిర్యానీని సౌత్​ ఇండియా టిఫిన్స్​ లిస్ట్​లో చేర్చి, అచ్చమైన హైదరాబాదీ మేధస్సును అవమానించొద్దని చెప్పారు. దీంతో ఆ చాట్​బాట్​ నాదెళ్లకు సారీ చెప్పింది. అనంతరం ఆ టిఫిన్స్ మధ్య ఎవరు గొప్పవారో తెల్చేలా ఓ నాటకం రాయమని చాట్​బాట్​కు సవాలు విసిరారు నాదెళ్ల. ఆ తర్వాత ఆ టిఫిన్స్​ ఒకదానితో ఒకటి మాట్లాడుతున్నట్టు సంభాషణలు స్క్రీన్​పై ప్రత్యక్షమయ్యాయి. ఆ సంభాషణ ఫొటోలను కూడా నాదెళ్ల ప్రదర్శించారు.

satyanadella ChatGPT
చాట్​జీపీటీ చాట్​బాట్ సత్య నాదెళ్ల​ సంభాషణ
satyanadella ChatGPT
చాట్​జీపీటీ చాట్​బాట్ సత్య నాదెళ్ల​ సంభాషణ
satyanadella ChatGPT
చాట్​జీపీటీ చాట్​బాట్ సత్య నాదెళ్ల​ సంభాషణ

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గురువారం దిల్లీలో సత్య నాదెళ్ల కలిశారు. డిజిటలైజేషన్​పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కొనియాడారు. భారత్​ డిజిటల్​ ఇండియా విజన్​లో తమూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

satyanadella met pm narendra modi
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల

"లోతైన అవగాహనతో జరిగిన ఈ సమావేశానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. డిజిటలైజేషన్​తో సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాకారం చేసుకునే విషయంలో ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టి స్ఫూర్తిదాయకం. భారత్​ తన డిజిటల్​ ఇండియా విజన్​ను సాకారం చేసుకుని ప్రపంచానికి ఓ దివిటీలా మారడంలో సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము" అని సత్య నాదెళ్ల ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.