ETV Bharat / business

Maruti Suzuki Discounts October 2023 : మారుతీ కార్లపై స్పెషల్​ డిస్కౌంట్స్​.. పండక్కి తక్కువ ధరకే కొనేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 7:24 PM IST

Updated : Oct 7, 2023, 6:35 AM IST

Maruti Suzuki Discounts October 2023 : దసరా పండక్కి కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఆలస్యం చేయకండి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తమ బ్రాండ్​ కార్లపై స్పెషల్​ ఆఫర్స్​ను ప్రకటించింది. మరి అవి ఏం కార్లు, ఎంత మేర డిస్కౌంట్స్​ను పొందవచ్చు అనే వివరాలు మీకోసం.

Maruti Suzuki Discounts October 2023
Maruti Discounts October 2023

Maruti Suzuki Discounts October 2023 : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కారు ప్రియుల కోసం అదిరిపోయే ఆఫర్స్​ను ప్రకటించింది. పండగ సీజన్​ను పురస్కరించుకుని ఈ బెస్ట్​​ డీల్స్​తో ( Maruti Discounts October 2023 ) సిద్ధమయింది. ఇప్పటిదాకా తమ కంపెనీ లాంఛ్​ చేసిన పలు ఎస్​యూవీలపై ఈ సూపర్​ డిస్కౌంట్స్​ను అందించనుంది. వీటిల్లో Alto 800, Alto K10, Maruti Celerio, Maruti S-Presso, Wagon-R, Swift, Dzire, Maruti Eeco మోడళ్లు ఉన్నాయి. మరి వీటిపై కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ ఎక్స్ఛేంజ్ బోనస్..
Maruti Alto 800, Maruti Alto K10 మోడళ్ల​పై రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్​ బోనస్​ను పొందవచ్చు. వీటిల్లో పెట్రోల్​, CNG వేరియెంట్లు ఉన్నాయి. అయితే మారుతీ ఆల్టో K10 ఎస్​యూవీపై ప్రత్యేకంగా రూ.30వేలు, రూ.20వేలు(CNG కార్లపై) కన్స్యూమర్​ ఆఫర్​ను కూడా అందిస్తుంది కంపెనీ.

Maruti Suzuki Discount Offers : మరో మోడల్​ Maruti Celerio(పెట్రోల్​, CNG)పై రూ.30వేల నుంచి రూ.35వేల వరకు కన్స్యూమర్​ ఆఫర్స్​తో పాటు రూ.20వేల ఎక్స్ఛేంజ్​ బోనస్​, అదనంగా రూ.4వేల కార్పొరేట్​ డిస్కౌంట్​ను పొందవచ్చు. అయితే కార్పొరేట్​ డిస్కౌంట్ అనేది CNG వేరియెంట్​కు వర్తించదు. ఇలా ఇతర మోడళ్లపై కూడా ఇదే తరహాలో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది మారుతీ.

Maruti Discounts October 2023 :

మోడల్వినియోగదారు ఆఫర్ఎక్స్ఛేంజ్​ బోనస్​+కార్పొరేట్​ డిస్కౌంట్​
Maruti Alto 800 (petrol) -రూ.15,000 వరకు
Maruti Alto 800 (CNG) -రూ.15,000
Maruti Alto K10 (petrol)రూ.30,000రూ.15,000
Maruti Alto K10 (CNG)రూ.20,000 రూ.15,000
Maruti Celerio (petrol)రూ.35,000 వరకురూ.20,000 + రూ. 4,000
Maruti Celerio (CNG)రూ.30,000రూ.20,000
Maruti S-Presso (petrol)రూ.30,000రూ.20,000 + రూ. 4,000
Maruti S-Presso (CNG)రూ.30,000రూ.20,000
Maruti Wagon-R 1.0L (petrol)రూ.25,000రూ.15,000 + రూ. 4,000
Maruti Wagon-R 1.0L (CNG)రూ.25,000రూ.15,000 + రూ. 4,000
Maruti Wagon-R 1.2L (petrol)రూ.25,000రూ.15,000
Maruti Swift (petrol)రూ.25,000రూ.15,000 + రూ. 4,000
Maruti Swift (CNG)రూ.25,000రూ.15,000
Maruti Dzire (petrol) -రూ.10,000
Maruti Eecoరూ.10,000 రూ.10,000 + రూ. 4,000

Suzuki Grand Vitara Vs Kia Carens : సుజుకీ గ్రాండ్ విటారా Vs కియా కారెన్స్​.. ఫీచర్స్ చూశారా..?

Most Affordable Automatic Cars In 2023 : రూ.8 లక్షల బడ్జెట్లో.. మంచి ఆటోమేటిక్ కార్ కొనాలా?.. మార్కెట్​లోని బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

Last Updated :Oct 7, 2023, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.