2022-23 క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 6.3%

author img

By

Published : Nov 30, 2022, 5:53 PM IST

Updated : Nov 30, 2022, 7:12 PM IST

india gdp growth rate q2 2022
2022-23 క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 6.3% ()

2022-23 జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం మేర వృద్ధి చెందింది. జాతీయ గణాంకాల కార్యాలయం ఈమేరకు వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4శాతంగా నమోదైంది.

భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో (Q2) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ (క్యూ1) త్రైమాసికంతో పోలిస్తే (13.5 శాతం) సగం వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) సంబంధిత గణాంకాలను బుధవారం వెలువరించింది.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం 5.8 శాతంగా నమోదవ్వచ్చని అంచనాలను వెలువరించింది. ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ వెలువరించిన బులెటిన్‌లో సైతం వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేసింది. అంచనాలకు అటుఇటూగా గణాంకాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో పొరుగు దేశం చైనా వృద్ధి రేటు 3.9 శాతంగా నమోదు కావడం గమనార్హం.

Last Updated :Nov 30, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.