ETV Bharat / business

ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్ ​- ఫ్రీగా క్రెడిట్ స్కోర్​ చెక్ చేసుకోవచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 9:35 AM IST

Updated : Jan 3, 2024, 10:54 AM IST

Etv Bharat
Etv Bharat

How to Check Credit Score in PhonePe for Free: మీ క్రెడిట్​ స్కోర్​ ఫ్రీ గా చెక్​ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్​ న్యూస్​. ప్రముఖ ఫిన్​టెక్​ సంస్థ ఫోన్​పే ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా మీ క్రెడిట్​ స్కోర్​ఫ్రీగా చెక్​ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం.

How to Check Credit Score in PhonePe for Free: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ యూజర్లకు ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. క్రెడిట్​ స్కోర్​ను ఉచితంగా తెలుసుకునేందుకు వీలుగా ఓ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం...

క్రెడిట్​ స్కోర్​ చెక్​ చేసుకునేందుకు వీలుగా.. "‘క్రెడిట్‌"’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ఈ సంస్థ. దీంట్లో క్రెడిట్‌ స్కోర్‌తో పాటు, క్రెడిట్‌ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. ఇంకా క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్ పేమెంట్స్, రుణ వాయిదాల చెల్లింపుల వివరాల్ని కూడా ఈ ఫీచర్‌తో సమర్థంగా మేనేజ్ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. మరి ఫోన్​పేలో క్రెడిట్​ స్కోర్​ ఫ్రీగా ఎలా చెక్​ చేసుకోవాలి..?

అమెజాన్ యూజర్లకు గుడ్​ న్యూస్​ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?

  • ముందుగా మీ ఫోన్​లో PhonePe యాప్​ను ఓపెన్​ చేయాలి.
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత హోమ్‌పేజీలోనే Credit అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే.. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు Credit పై క్లిక్‌ చేస్తే "Credit Score for Free"‘అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • దాని కిందే Check Now అనే బటన్‌ ఉంటుంది. దానిని క్లిక్‌ చేయాలి.
  • వెంటనే క్రెడిట్‌ స్కోర్‌ మీ స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్‌ క్రెడిట్‌ బ్యూరో అందిస్తోంది.
  • ఈ స్కోర్‌తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి, క్రెడిట్‌ మిక్స్‌, క్రెడిట్‌ ఏజ్‌, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.

బీ అలర్ట్​- జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్​! కచ్చితంగా తెలుసుకోండి!

అంతేకాకుండా.. ఈ ఫీచర్‌లో మేనేజ్‌ క్రెడిట్స్‌, రుణ ప్రొఫైల్‌, పేమెంట్‌ డ్యూస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్‌ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. సంబంధిత సమాచారాన్ని ఎంటర్‌ చేసి ఎప్పటికప్పుడు బిల్లు, ఈఎంఐల చెల్లింపుల స్థితిని సమీక్షించుకోవచ్చు. అయితే, ఫోన్‌పేలో లాగిన్‌ అయిన ఫోన్‌ నెంబర్‌.. పాన్‌కార్డుతో అనుసంధానమైన నెంబర్‌ ఒకటే అయి ఉండాలి.

PF డబ్బులు తీయాలా? - ఇలా చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది!

ఇంకా మరెన్నో లాభాలు: అలాగే క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ఏం చేయాలో కూడా యూజర్లకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో క్రెడిట్ ట్యాబ్​లో మరిన్ని సేవలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. యాప్​లోనే లోన్లు ఇచ్చే ఫీచర్​ను తీసుకురానున్నట్లు వివరించింది. దీని ద్వారా యూజర్లు చాలా సులభంగా రుణాలు పొందవచ్చని పేర్కొంది.

కాగా ఈ రోజుల్లో.. క్రెడిట్ స్కోరు, సిబిల్ స్కోరు చాలా కీలకంగా మారింది. బ్యాంకులు లేదా ఏదైనా ఫైనాన్స్ సంస్థలో ఏ లోన్ కావాలన్నా వారు ముందుగా మీ క్రెడిట్ స్కోరునే తనిఖీ చేస్తారు. అలాగే స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటేనే లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. వడ్డీ రేటు కూడా తక్కువగా ఆఫర్ చేస్తుంటారు. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే ఈజీగా లోన్లు రావడమే కాకుండా.. ఎక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డులు పొందొచ్చు.

మరో అదిరిపోయే ఫీచర్​- ఇక మరింత ఈజీగా గూగుల్​పేలో చెల్లింపులు!

వాట్సాప్​లో 'యూజర్ నేమ్' ఫీచర్​​ - ఇకపై ఫోన్ నంబర్​ షేరింగ్ బంద్​!

UPI ట్రాన్సాక్షన్స్‌ లిమిట్‌ - ఫోన్​పే, జీపేలో అలా - పేటీఎంలో ఇలా!

Last Updated :Jan 3, 2024, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.