ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Feb 27, 2023, 11:04 AM IST

gold rate today
బంగారం

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.57,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.650 దిగొచ్చి.. ప్రస్తుతం రూ.65,100 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,400గా ఉంది. కిలో వెండి ధర రూ.65,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,400 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,400 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,100గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1810.00 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.67 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,48,600 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,48,600
ఇథీరియంరూ.1,35,704
టెథర్​రూ.82.91
బైనాన్స్​ కాయిన్​రూ.25,456
యూఎస్​డీ కాయిన్రూ.82.92

స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్ల నష్టంతో 59,159 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 17,375 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, టాటా స్టీల్‌, విప్రో, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు పడిపోయి 82.88 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.