ETV Bharat / business

Gold Rate Today 13th September 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 9:33 AM IST

Updated : Sep 13, 2023, 10:48 AM IST

Gold Price Today 13th September 2023
Gold Rate Today 13th September 2023

Gold Rate Today 13th September 2023 : దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొంచెం తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 13th September 2023 : దేశంలో పసిడి ధరలు మరలా భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం మరికాస్త తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,088గా ఉండగా.. బుధవారం రూ.455 పెరిగి రూ.60,543 వద్దకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,495గా ఉండగా.. బుధవారం రూ.425 తగ్గి రూ.73,070కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 13th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,088గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,070గా ఉంది.
  • Gold Price In Vijayawada 13th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 13th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070గా ఉంది.
  • Gold Price In Proddatur 13th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,088గా ఉంది. కిలో వెండి ధర రూ.73,070కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 13th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1923 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1919 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.90 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 13th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,45,204 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,45,204
ఇథీరియంరూ.1,31,889
టెథర్​ రూ.82.93
బైనాన్స్ కాయిన్రూ.17,406
యూఎస్​డీ కాయిన్రూ.82.93

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 13th September 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం కూడా ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 45 పాయింట్లు నష్టపోయి 67,175 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 13 పాయింట్లు కోల్పోయి 19,980 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : పవర్​గ్రిడ్​, ఐటీసీ, కోటక్​ బ్యాంక్​, టాటా మోటార్స్​, టైటాన్​, రిలయన్స్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఎం అండ్ ఎం, ఎల్​ అండ్​ టీ, ఏసియాన్​ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​

రూపాయి విలువ!
Rupee Open 13th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి రూ.82.92 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 13th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 13th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.20 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 92.24 డాలర్లుగా ఉంది.

Last Updated :Sep 13, 2023, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.