ETV Bharat / business

రెండేళ్లలో నాలుగు రెట్ల ఉద్యోగాలు.. చైనాపై ఆధార పడకుండా ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్లాన్​!

author img

By

Published : Nov 12, 2022, 7:46 AM IST

Updated : Nov 12, 2022, 7:56 AM IST

foxconn plans to increase workforce 4 times at india plant
foxconn plans to increase workforce 4 times at india plant

ఐఫోన్​ సరఫరాలో ఇబ్బందులు తెలత్తకూడదని.. చైనా నుంచి భారత్​కు తన సంస్థను తరలించింది ఫాక్స్​కాన్​ సంస్థ. తాజాగా ఉత్పత్తి పెంచేెందుకు తమ ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుకునేందుకు ప్లాన్​ చేస్తోంది.

చైనాలో కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఐఫోన్‌ తయారీలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఫాక్స్‌కాన్‌ భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే లేటెస్ట్‌ ఐఫోన్‌-14 మోడళ్ల తయారీని చెన్నైలోని ప్లాంటులో పెంచింది. చైనాలో తరచూ ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తి ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకునే యోచనలో ఫాక్స్‌కాన్‌ ఉంది. అందుకు భారత్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.

కార్యకలాపాల్ని విస్తృతం చేయడంలో భాగంగా ఫాక్స్‌కాన్‌ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఇద్దరు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్యను నాలుగింతలకు పెంచుకోవాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ప్లాంటులో కొత్తగా మరో 53,000 మంది ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. ఫలితంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 70,000కు చేరుతుందని సమాచారం. చైనాలోని జెంగ్‌ఝౌలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో దాదాపు 2 లక్షల మంది పనిచేస్తున్నారు. దానితో పోలిస్తే చెన్నైలోని ప్లాంటు చాలా చిన్నది.

ఇవీ చదవండి : క్యూ2లో దుమ్మురేపిన LIC.. రూ.680 కోట్లు లాభం

ఇలా చేస్తే EMI భారం నుంచి సత్వర విముక్తి!

Last Updated :Nov 12, 2022, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.