ETV Bharat / business

Buy Second Hand Car Online : ఈజీ రిజిస్ట్రేషన్​తో సెకెండ్​ హ్యాండ్ కారు కొనాలా?.. టాప్​ 10 వెబ్​సైట్స్​ ఇవే..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 2:22 PM IST

Buy Second Hand Car Online : సెకెండ్​ హ్యాండ్​లో కారు కొందామని ఆలోచిస్తున్నారా? మధ్యవర్తిని ఎలా సంప్రదించాలో తెలియటం లేదా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మార్కెట్​లో కొన్ని కంపెనీలు వాడిన కార్ల క్రయవిక్రయాల కోసం ప్రత్యేకంగా యాప్స్​, వెబ్​సైట్స్​ను నిర్వహిస్తున్నాయి. వీటి సాయంతో మీరు మీకు నచ్చిన కారును బడ్జెట్​ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Top 10 Websites And Bank Auctions To Buy Second Hand Cars
Top 10 Websites To Buy Second Hand Cars

Buy Second Hand Car Online : కారు కొనాలి.. అందులో ఎక్కి తిరగాలని అందరికీ కోరికగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ సొంత కారు ఉంటే బాగుండు అని అనుకుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో ఓ కొత్త కారు కొనాలంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించలేని వారు కనీసం సెకెండ్​ హ్యాండ్​ కారైనా కొందామని అనుకుంటారు. ఎందుకంటే ఈ రకమైన కార్లు కాస్త తక్కువ ధరలో దొరకుతాయి కాబట్టి. ఇలాంటి వారికోసమే మార్కెట్​లో కొన్ని కంపెనీలకు చెందిన ప్రముఖ వెబ్​సైట్​లు లేదా యాప్​లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో వాహన రిజిస్ట్రేషన్​ దగ్గర్నుంచి వాటి డాక్యుమెంటేషన్​ వరకు పూర్తి ప్రక్రియ కార్ల క్రయవిక్రయాలు జరిపే ఈ కంపెనీలే చూసుకుంటాయి. మరి అలాంటి సేవలిందిస్తున్న టాప్​ వెబ్​సైట్స్​ వివరాలు మీకోసం(How To Buy Second Hand Car Online).

Websites To Buy Used Cars : సెకెండ్ హ్యాండ్​ కార్ల క్రయవిక్రయాలు జరిపే టాప్​ అప్లికేషన్స్ లేదా వెబ్​సైట్స్​ ఇవే..

CarDekho
olx
Quikr
CarTrade
CarWale
Truebil
cartoq
car bazaar
Car Collection
Cars24

లాభాలు..
Benefits Of Buying Used Car Through Websites : సెకెండ్ హ్యాండ్ కార్లను నేరుగా యజమాని దగ్గర్నుంచి కొనే సమయాల్లో పత్రాలు, రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, బేరసారాలు ఇలా కొన్ని రకాల సమస్యలు ఎదురుకావచ్చు. కానీ, వాడిన కార్లను అమ్మే కొన్ని రకాల యాప్స్ లేదా వెబ్​సైట్స్​ ద్వారా మీకు నచ్చిన కారును కొనుగోలు చేస్తే భవిష్యత్​లో ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సెకెండ్​ హ్యాండ్​ కారుకు సంబంధించి రిజిస్ట్రేషన్​, వారంటీ సహా తదితర అంశాలన్నీ సంబంధిత కంపెనీయే చూసుకుంటుంది. దీంతో కారుకు సంబంధించి మీకు భవిష్యత్​లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు.

బ్యాంకుల ద్వారా కూడా..
Bank Car Auction Websites : బ్యాంకు నిబంధనల ప్రకారం.. సాధారణంగా కొందరు కస్టమర్లు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన వాహనాలను సీజ్​ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో కారు కూడా ఒకటి. అలా సీజ్​ చేసిన సెకెండ్​ హ్యాండ్​ కార్లను బ్యాంకులు కొద్ది రోజుల తర్వాత వేలం వేసి అమ్మేస్తుంటాయి. వీటిని మీకు కావాల్సిన బడ్జెట్​ ధరల్లోనే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సదరు కారుకి సంబంధించి మొత్తం ధ్రువపత్రాలను బ్యాంకులే మీకు అందజేస్తాయి. స్వయంగా బ్యాంక్​ తరఫున మీరు కొనుగోలు చేస్తారు కాబట్టి భవిష్యత్​లో మీకు ఎటువంటి సమస్యలు తలెత్తవు.

  • నేషనల్​ హౌసింగ్​ బ్యాంక్​ (NHB) Residex

వెబ్​సైట్​- https://www.nhb.org.in/Residex.aspx

  • రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (RBI) Auction

వెబ్​సైట్​- https://rbi.org.in/Scripts/BS_ViewRTGS.aspx

  • స్టేట్​ బ్యాంక్ ఆప్​ ఇండియా (SBI) Auctions

వెబ్​సైట్​- https://www.sbi.co.in/portal/web/home/auctions

  • బ్యాంక్​ ఆప్​ బరోడా (BOB) Auctions

వెబ్​సైట్​- https://www.bankofbaroda.in/bank-auction

  • యూనియన్​ బ్యాంక్​ ఆప్​ ఇండియా (UBI) Auctions

వెబ్​సైట్​- https://www.unionbankofindia.co.in/English/Foreclosure.aspx

లోన్​ సౌకర్యం కూడా..
Second Hand Car Finance Options : మీరు వెబ్​సైట్​ల ద్వారా కారును తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోలేకపోతే ఆయా వెబ్​సైట్​ కంపెనీలు లోన్​ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఈ సౌలభ్యంతో మీరు మెచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు.

Gold Rate Today 26th October 2023 : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.