ETV Bharat / business

'ఆఫీస్​లో హాయిగా నిద్రపోండి'.. స్టార్టప్ కంపెనీ బంపర్ ఆఫర్!

author img

By

Published : May 8, 2022, 11:54 AM IST

Updated : May 8, 2022, 1:18 PM IST

nap at work on lunch break: మధ్యాహ్న భోజనం తర్వాత ఓ కునుకు తీస్తే బాగుంటుందని చాలా మంది ఉద్యోగులు భావిస్తుంటారు. విదేశాల్లో కొన్ని సంస్థలు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఆ సంస్కృతి మన దేశంలోని మొదలైంది. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్​ కంపెనీ.. తమ ఉద్యోగులు మధ్యాహ్నం అరగంట నిద్ర పోయేందుకు అధికారికంగా అవకాశం కల్పిస్తోంది.

nap at work on lunch break
ఆఫీసులో అరగంట కునుకు తీయొచ్చు

nap at work on lunch break: ప్రభుత్వ, ప్రైవేటు.. ఏ సంస్థలోనైనా పని భారంతో ఉద్యోగులు అలసిపోతుంటారు. రోజులో దాదాపు 8-10 గంటల వరకు విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల శరీరం నీరసంగా మారుతుంది. ఉత్సాహంగా ఉండేందుకు మధ్య మధ్యలో కాఫీలు, టీలు అని తాగుతుంటారు. కానీ, కాసేపు కునుకు తీయటం వల్ల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి, మానసిక ఆందోళన దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దానిని గుర్తించిన బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్​ కంపెనీ.. పని ప్రదేశంలో అరగంట కనుకు(న్యాప్​ టైమ్​) తీసేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తోంది. అదే.. వేక్​ఫిట్​ సొల్యూషన్స్​.

nap at work on lunch break
వేక్​ఫిట్​ సొల్యూషన్స్​

పరుపులు, సోఫాల తయారీ రంగంలో ఉన్న ఈ సంస్థ.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఇటీవలే తమ కార్యాలయాన్ని తెరిచింది. పని భారంతో అలసిపోయిన ఉద్యోగులను ఉత్తేజవంతం చేసేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట సమయం నిద్రలోకి జారుకునేందుకు 'న్యాప్​ టైమ్​ అవర్​'ను తీసుకొచ్చింది.

వేక్​ఫిట్​ సహ వ్యవస్థాపకులు చైతన్య రామలింగ గౌడ ఇటీవలే తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్​ పంపారు. మధ్యాహ్నం 2-2.30 గంటల మధ్యలో సిబ్బంది నిద్రపోయేందుకు అధికారికంగా అనుతిస్తున్నట్లు పేర్కొన్నారు. వేక్​ఫిట్.. ఆన్​లైన్​ ద్వారా వినియోగదారులతో మాట్లాడి..​ నిద్ర సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ. అలాంటి కంపెనీ ఈ పాలసీని తీసుకురావటం సరిగా సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

nap at work on lunch break
వేక్​ఫిట్​ సహ వ్యవస్థాపకులు చైతన్య రామలింగ గౌడ ట్వీట్​

"నిద్రకు సంబంధించిన వ్యాపారంలో ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నాం. అయినప్పటికీ విశ్రాంతి అనే కీలక అంశానికి న్యాయం చేయటంలో విఫలమయ్యాం. మేము ఎప్పుడూ నిద్రను సీరియస్​గా తీసుకుంటాము. ఈరోజు నుంచి ఆ విషయాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్తున్నాం. నాసా పరిశోధన ప్రకారం 26 నిమిషాల పాటు ఓ కునుకు తీస్తే 33 శాతం పనితీరు మెరుగుపడుతుంది. అలాగే హార్వర్డ్​ అధ్యయనం సైతం ఇదే చెబుతోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ మధ్యాహ్నం 2-2.30 గంటల వరకు అధికారిక న్యాప్​ టైమ్​ ఇవ్వాలని నిర్ణయించాం. "

- చైతన్య రామలింగ గౌడ, వేక్​ఫిట్​ సహ వ్యవస్థాపకులు

ఇప్పటి నుంచి మధ్యాహ్నం నిద్రపోయే హక్కును ఉద్యోగులందరికీ కల్పిస్తున్నామని, అందుకు తగినట్లుగా వర్కింగ్​ క్యాలెండర్​లో మార్పులు కూడా చేసినట్లు ఈమెయిల్​లో పేర్కొన్నారు చైతన్య. ఇందుకోసం ఆఫీసులో న్యాప్​ పాడ్స్​, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు.

nap at work on lunch break
వేక్​ఫిట్​ సొల్యూషన్స్​ ట్వీట్​

ఇదీ చూడండి: స్విగ్గీలో కాఫీ ఆర్డర్.. బద్దకంతో డెలివరీ బాయ్‌ 'స్మార్ట్​ ప్లాన్'​!

కునుకు పట్టదు.. మనసు కుదుటపడదు

కునుకు మంచిదే.. కాస్త రిలాక్స్​ అయిపోండి!

Last Updated :May 8, 2022, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.