ETV Bharat / business

కరోనా లాస్​ రికార్డ్​: 69 రోజులు... 16 వేల పాయింట్లు

author img

By

Published : Mar 23, 2020, 4:24 PM IST

Updated : Mar 23, 2020, 5:26 PM IST

stock
సెన్సెక్స్​

41,953... సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం. జనవరి 14న ఈ రికార్డు నమోదైంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం 26 వేల మార్కుకు దిగువకు పతనమైంది సెన్సెక్స్. ఎందుకిలా? ఈ 69 రోజుల్లో ఏం జరిగింది?

యుద్ధాలు... వాణిజ్య యుద్ధాలు... కుంభకోణాలు... ఇలా ఎన్నో సంక్షోభాలను చూశాయి భారత స్టాక్​ మార్కెట్లు. భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. కానీ... ఒక రోజులో కాకపోతే ఒక వారంలోనైనా తిరిగి పుంజుకున్నాయి. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నం. కరోనా పంజా దెబ్బకు పతనాల పరంపర కొనసాగడమే తప్ప కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.

దలాల్ స్ట్రీట్​లో ఈ రివర్స్​ గేర్​ మొదలై దాదాపు నెల అవుతోంది. కరోనా విజృంభిస్తున్న కొద్దీ మార్కెట్ పతనం మరింత తీవ్రమవుతోంది. నిత్యం లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరవుతోంది.

జీవితకాల గరిష్ఠం నుంచి...

2020 జనవరి 14న సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. కానీ ఈ రెండు నెలల్లో సెన్సెక్స్​ సుమారు 16 వేల పాయింట్లు కోల్పోయింది. బీఎస్​ఈ సూచీ​ ప్రస్తుతం (మార్చి 23) 25,981 పాయింట్లకు పతననైంది. నిఫ్టీ 7,610కి చేరింది.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి ట్రేడింగ్ ఇలా..

తేదీ సెన్సెక్స్నిఫ్టీ
ఫిబ్రవరి 28-1,448-431
మార్చి 2 -153 -69
మార్చి 3 +480 +171
మార్చి 4 -214 -52
మార్చి 5 +61 +18
మార్చి 6 -894 -280
మార్చి 9 -1,942 -538
మార్చి 11 +62+07
మార్చి 12 -2,919 -868
మార్చి 13 +1,325+365
మార్చి 16 -2,713 -758
మార్చి 17 -811-230
మార్చి 18 -1,710 -498
మార్చి 19 -581 -205
మార్చి 20 +1,628 +482
మార్చి 23 (నేడు) -3,935 -1,135

ఇదీ చూడండి: ఢమాల్​ స్ట్రీట్​: సెన్సెక్స్​ 3,935 పాయింట్లు పతనం

Last Updated :Mar 23, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.