దూసుకెళ్లిన సూచీలు- నిఫ్టీ 241 పాయింట్లు వృద్ధి

author img

By

Published : Mar 14, 2022, 9:28 AM IST

Updated : Mar 14, 2022, 3:44 PM IST

Stock market live updates

15:43 March 14

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 936 పాయింట్లకు పైగా ఎగబాకి 56,486 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ కూడా 241 పాయింట్లు వృద్ధి చెంది 16,871 వద్ద ట్రేడింగ్ ముగించింది.

12:10 March 14

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 520 పాయింట్లు పెరిగి 56,070కి చేరింది. నిఫ్టీ 125 పాయింట్లు వృద్ధి చెంది 16,755కి చేరింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు 2శాతానికి పైగా లాభపడ్డాయి. ఐఓసీ, ఓఎన్​జీసీ, టాటా మోటార్స్​ 2శాతానికిపైగా నష్టపోయాయి.

11:10 March 14

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 423 పాయింట్ల వృద్ధి చెంది 56వేల మార్కుకు దగ్గరగా ఉంది. ప్రస్తుతం 55,973 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,727 వద్ద ట్రేడవుతోంది.

09:12 March 14

దూసుకెళ్తున్న సూచీలు.. 56వేల మార్కు ఎగువన సెన్సెక్స్​

Stock market news: స్టాక్​మార్కెట్లు ఈ వారం తొలిరోజు సెషన్​ను లాభాలతో ప్రారంభించాయిం. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సెన్సెక్స్​ 215 పాయింట్లు వృద్ధి చెంది 55,766కి చేరింది. నిఫ్టీ 48 పాయింట్లు మెరుగుపడి 16,678 వద్ద ట్రేడవుతోంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా మోటార్స్​, ఐఓసీ, హెచ్​యూఎల్ షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Last Updated :Mar 14, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.