ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 200 మైనస్​

author img

By

Published : Apr 23, 2021, 9:32 AM IST

Updated : Apr 23, 2021, 3:44 PM IST

STOCKS LIVE
స్టాక్​ మర్కెట్లు లైవ్

15:40 April 23

14,350 దిగువకు నిఫ్టీ..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 202 పాయింట్లు తగ్గి 47,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 14,341 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాలను గడించాయి. 

ఎం&ఎం, డాక్టర్​ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:11 April 23

మళ్లీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా తగ్గి.. 47,947 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా కోల్పోయి.. 14,361 వద్ద కొనసాగుతోంది.

  • పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ లాభాల్లో ఉన్నాయి.
  • డాక్టర్​ రెడ్డీస్​, ఎం&ఎం, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:14 April 23

బ్యాంకింగ్​ షేర్ల జోరు​-లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్‌ 166 పాయింట్లకు పైగా ఎగబాకి 48,247 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభపడి 14,457 వద్ద ట్రేడవుతోంది.

యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, బజాజ్​ ఫినాన్స్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఓఎన్​జీసీ, నెస్లే, డాక్టర్​ రెడ్డీస్, ఎం అండ్ ఎం, హెచ్​యూఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

10:24 April 23

మార్కెట్లకు ఒడుదొడుకులు..

ఐటీ, బ్యాంకింగ్​​​ రంగాల షేర్ల విక్రయాలతో స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడ్​ అవుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 16 పాయింట్లు బలపడి 48,096 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 14,413 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు..

పవర్​గ్రిడ్, ఎన్టీపీసీ, ఏషియన్​ పెయింట్స్, ఓఎన్​జీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లోనివి..

హెచ్​యూఎల్​, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్​ డీలాపడ్డాయి. 

08:46 April 23

బ్యాంకు షేర్లు పతనం.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్​మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 237 పాయింట్లు కోల్పోయి 47,844 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ స్వల్పంగా 45 పాయింట్లు నష్టపోయి 14,361 పాయింట్లకు చేరుకుంది.

లాభనష్టాల్లో..

పవర్​గ్రిడ్, ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్, టైటాన్, సన్​ ఫార్మా లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ, నెస్లే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated :Apr 23, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.