ETV Bharat / business

సామాన్యుడికి చుక్కలు- మళ్లీ పెరిగిన పెట్రోల్​ ధరలు

author img

By

Published : Oct 8, 2021, 9:03 AM IST

Fuel Price Toda
పెట్రోల్ ధర

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

దేశంలో పెట్రో ధరల బాదుడు (Petrol price hike) ఆగడం లేదు. దేశవ్యాప్తంగా శుక్రవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 35 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.54కు చేరగా.. డీజిల్​ ధర రూ.92.13కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 29 పైసలు పెరిగి రూ.109.51కి చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ. 99.88 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​పై (Kolkata Today Diesel Price) 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.104.19కు చేరింది. లీటర్​ డీజిల్​ ధర​ రూ.95.19గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ ధర​ 26 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ.100.98 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.96.56గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

  1. హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.67కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 39 పైసలు అధికమై.. లీటర్​ రూ.100.48కి చేరింది.
  2. విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.55కు చేరుకుంది. డీజిల్​పై 36 పైసలు పెరిగి.. రూ.100.83కు చేరింది.
  3. గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 30 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.109.82గా ఉంది. డీజిల్​ లీటర్​కు 36 పైసలు పెరిగి.. రూ.102.06 వద్ద ఉంది.

ఇదీ చూడండి: వ్యాపారాల్లో భారత మహిళల సత్తా- ఫోర్బ్స్ జాబితాలో స్థానం

ఇదీ చూడండి: భారత వృద్ధిరేటుపై ఫిచ్​, ఫిక్కీ భిన్న అంచనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.