ETV Bharat / business

Stock Markets: ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలే కీలకం!

author img

By

Published : Aug 29, 2021, 12:29 PM IST

stock markets
స్టాక్​ మార్కెట్లు

దేశీయంగా మార్కెట్లను(Stock markets) ఈ వారం.. ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే.. కరోనా వైరస్​(Corona virus), వ్యాక్సినేషన్​పైనా(Vaccination) మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

స్థూల ఆర్థిక గణాంకాలు(macroeconomic data), ఆటో సేల్స్(auto sales india)​, అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock markets) దిశా నిర్దేశం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి(Corona virus), పెరుగుతున్న కేసులు, టీకాల పంపిణీపైనా(Vaccination) మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

" దేశీయంగా త్రైమాసిక ఫలితాల కాలం ముగిసింది. గతంలో కంటే మంచి ఫలితాలే వెల్లడయ్యాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతోంది. ఆర్థిక రంగం సానుకూలంగానే ఉంది. అయితే.. గత 18 నెలలుగా వృద్ధి మందగమనాన్ని పరిశీలిస్తే.. కొంత ఆందోళన కలుగుతుంది. దీర్ఘకాలంపై ఆలోచిస్తే.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, వ్యాక్సినేషన్​ వేగంగా సాగటం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతాయి. "

- సిద్ధార్థ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.

వీటన్నింటితోపాటు రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి: Stock Market: సెన్సెక్స్​ కొత్త రికార్డ్- తొలిసారి 56వేల పైన...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.