ETV Bharat / business

రెపో రేటు మళ్లీ యథాతథమేనా?

author img

By

Published : Dec 2, 2020, 4:55 PM IST

RBI deliberation on policy rate
రెపో రేటు కోతపై అంచనాలు

మూడు రోజుల పాటు జరగనున్న ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటు సహా ఇతర ఆర్థిక అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనుంది ఎంపీసీ. అయితే అక్టోబర్​లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికిపైగా నమోదైన కారణంగా మరోసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం భేటీ అయ్యింది. మూడు రోజుల పాటు జరగనున్న ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లు సహా ఇతర ఆర్థిక అంశాలపై అవసరమైన నిర్ణయాలు తీసుకోనుంది కమిటీ. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ నెల 4న వెల్లడించనుంది ఆర్​బీఐ.

అయితే అక్టోబర్​లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్​బీఐ, ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని దాటిన కారణంగా రెపో రేటును మరోసారి యథాతథంగా ఉంచేందుకే ఎంపీసీ మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడో సారి అవుతుంది.

గత సమీక్షలో నిర్ణయాలు ఇలా..

అక్టోబర్​ సమీక్షలోనూ.. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్​బీఐ. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం -9.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అయితే దేశ జీడీపీ అంచనాలకు మించి వేగంగా పుంజుకుంటున్నట్లు ఇటీవలి అధికారిక గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో.. ఆర్​బీఐ వృద్ధి రేటు అంచనాలను సవరించే అవకాశముంది.

మొత్తం మీద ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 115 బేసిస్​ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్​బీఐ. కరోనా నేపథ్యంలో రుణాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో రెపో రేటు ప్రస్తుతం 4 శాతం, రివర్స్‌ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉన్నాయి.

ఇదీ చూడండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.