ETV Bharat / business

జీవనకాల గరిష్ఠానికి విద్యుత్ డిమాండ్

author img

By

Published : Jan 22, 2021, 5:51 PM IST

power demands hit new record
దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్​ డిమాండ్

దేశీయ విద్యుత్​ డిమాండ్ శుక్రవారం జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మొత్తం డిమాండ్ 1,87,300 మెగా వాట్ల స్థాయిని తాకినట్లు విద్యుత్​ శాఖ ప్రకటించింది.

దేశంలో విద్యుత్​ డిమాండ్ శుక్రవారం సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలిసారి 187.3 గిగా వాట్ల డిమాండ్​ నమోదైనట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇంతకు ముందు ఇదే నెల 20న.. 1,85,820 మెగావాట్లుగా విద్యుత్​ డిమాండ్​ నమోదైనట్లు తెలిపింది. తాజాగా ఇది 1,87,300 మెగా వాట్ల మార్క్​ను (ఉదయం 10:20 ప్రాంతంలో) తాకినట్లు వివరించింది. గత ఏడాది నమోదైన అత్యధిక విద్యుత్​ డిమాండ్ 182.89 గిగా వాట్లను వెల్లడించింది.

డిమాండ్​ ఈ స్థాయిలో పెరగటం.. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:భగ్గుమన్న పెట్రోల్​, డీజిల్ ధరలు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.