ETV Bharat / business

పాన్​- ఆధార్​ లింక్​ గడువు 3 నెలలు పొడిగింపు

author img

By

Published : Jun 25, 2021, 8:03 PM IST

కరోనా నేపథ్యంలో పాన్​ ఆధార్​ అనుసంధానానికి కేంద్రం మరోసారి గడువు పెంచింది. చివరిసారిగా పెంచిన గడువు జూన్​ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి గడువును సెప్టెంబర్​ 30గా నిర్ణయించింది.

Deadline to link Pan with Aadhar
పాన్​ ఆధార్​ లిక్​ తుది గడువు

పాన్‌ కార్డు, ఆధార్‌ అనుసంధాన(aadhar pan card link) గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30ని తాజా గడువుగా పేర్కొంది. గతంలో విధించిన గడువు జూన్‌ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది.

పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్‌ 30కి.. ఇలా గడువును కేంద్రం పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది.

వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును కూడా మరో రెండు నెలలు.. అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఇదీ చదవండి: కొవిడ్​ పరిహారంపై పన్ను మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.