ETV Bharat / business

రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమీక్ష హైలైట్స్

author img

By

Published : Oct 9, 2020, 12:51 PM IST

Updated : Oct 9, 2020, 1:24 PM IST

ఆర్థిక నిపుణుల అంచనాలు నిజం చేస్తూ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వు బ్యాంక్. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సమీక్షలో ఆర్​బీఐ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ఇలా ఉన్నాయి.

Rbi mpc meet details
ఆర్​బీఐ సమీక్ష అంచనాలు

లక్ష్యాలను మించి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ). శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. రివర్స్ రెపోరేటు (3.35 శాతం)లోనూ మార్పు లేదని స్పష్టం చేసింది.

ఎంపీసీ సమీక్ష హైలైట్స్..

  • తక్షణ నగదు బదిలీ వ్యవస్థ(ఆర్​టీజీఎస్) సేవలు.. డిసెంబర్ నుంచి వారమంతా, రోజుకు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.
  • వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు వచ్చే వారంలో రూ. 20,000 కోట్ల మేర ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ వేలం.
  • దేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.5 శాతం క్షీణతను నమోదు చేయొచ్చు.
  • జులై-సెప్టెంబర్​లో త్రైమాసికంలో '-9.8' శాతం, అక్టోబర్-డిసెంబర్​ త్రైమాసికంలో '-5.6' శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చు. మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు '-0.5' శాతానికి చేరొచ్చు.
  • 2021-22 ఏప్రిల్-జూన్​ మధ్య వృద్ధి రేటు భారీగా 20.6 శాతానికి పుంజుకునే అవకాశాలున్నాయి.
  • కరోనా వైరస్​పై పోరులో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తోంది. ఈ సమయంలో నియంత్రణ నుంచి ఆర్థిక రికవరీ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
  • సెప్టెంబర్​ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ డిసెంబర్​, మార్చి త్రైమాసికాల్లో.. ప్రభుత్వం, ఆర్​బీఐ లక్ష్యానికి సమీపిస్తుందని అంచనా.
  • సెప్టెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా నమోదు కావచ్చు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల తాత్కాలికమే. వ్యవసాయ రంగంపై సానుకూల అంచనాలే ఉన్నాయి. చమురు ధరలు పరిమితుల్లోనే ఉన్నాయి.

ఆర్​బీఐ ఎంపీసీ సమీక్షపై మరింత సమాచారం ఇక్కడ చూడండి

Last Updated : Oct 9, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.