ETV Bharat / business

పన్నురేట్లను తగ్గిస్తేనే.. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం!

author img

By

Published : Jan 10, 2021, 5:49 PM IST

కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో 2020-21 ఆర్థిక సంవత్సరం మునుపెన్నడూ లేని ప్రతికూలతలను నమోదు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో కేంద్రం ప్రవేశపెట్టనున్న 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. పన్నుల విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతటా ఆసక్తి నెలకొంది. దీనిపై ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే..

Budget 2021-22: Tax rate cut will bring more revenue, revive economy
పన్నురేట్లను తగ్గిస్తేనే.. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం!

ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాల్లో ప్రధాన పాత్ర పోషించేవి పన్నులు. అయితే.. గతేడాది కొవిడ్​ కారణంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గింది. లాక్​డౌన్లు తదననంతర పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల ప్రారంభంలో 2021-22 బడ్జెట్​ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర సమాయత్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పన్ను రేట్లపై కోత విధించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు సలహా ఇస్తే విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ, చాలా మంది ఆర్థికవేత్తలు ఇప్పుడు ఇదే సూచిస్తున్నారు.

భారీ నష్టాలు..

ఆర్థికవ్యవస్థను పునురుద్ధరించడం, వనురులను పెంపొందించడం.. అనేవి ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు ఉన్న రెండు అతిపెద్ద సవాళ్లు. కొవిడ్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనమవడమే కాదు.. జీడీపీ వృద్ధి కూడా పడిపోయింది.

  • గత రెండేళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండగా.. కొవిడ్​ మహమ్మారి మరింత దెబ్బ తీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీలో 8 శాతం క్షీణత నమోదవుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల రెవెన్యూ వసూళ్ల ఆధారంగా వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
  • అధికారిక సమాచారం ప్రకారం... ఏప్రిల్​ నుంచి నవంబర్​ మధ్య కేంద్రానికి బడ్జెట్​లో 37 శాతం మాత్రమే​ ఆదాయం(పన్ను, పన్నేతర, రెవెన్యూ, ఇతర మార్గాల్లో) సమకూరింది.
  • సంఖ్యాపరంగా చూస్తే ఇది రూ.8.31 లక్షల కోట్లుగా ఉంది. కాగా.. భారత్​ ఈ మార్గాల్లో రూ.22.46 లక్షల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది.
  • గతేడాది ఇదే సమయంలో సమకూరిన ఆదాయం... మొత్తం బడ్జెట్​లో యాభై శాతంగా ఉండటం గమనార్హం.

ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున.. పన్నుల వసూళ్లు పెరుగుతాయి. కానీ, కొరత కూడా ఉంటుందని పాలసీ థింక్​ ట్యాంక్​ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చరణ్ సింగ్ అన్నారు. అయితే.. ఈ 9 నెలల్లో జరిగిన నష్టం రానున్న మూడునెలల్లో భర్తీ అవ్వలేదని ఆయన తెలిపారు.

పన్ను, పన్నేతర ఆదాయానికి గండి..

ఏప్రిల్​- నవంబర్​ మధ్య రెవెన్యూ వసూళ్లు రూ.20.21 లక్షల కోట్లు అందుతాయని కేంద్రం అంచనా వేయగా.. కేవలం రూ..8.13 కోట్లు అందాయి. మొత్తం నిర్దేశించుకున్న రెవెన్యూ వసూళ్లలో ఇది 40.2 శాతం మాత్రమే.

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​ నుంచి నవంబర్​ వరకు పన్నుల ద్వారా రూ.16.36 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేయగా... రూ.6.88 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అందుకుంది.
  • ఇది నిర్దేశించుకున్న బడ్జెట్​లో 42.1 శాతం మాత్రమే. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో 45.5 శాతం ఆదాయాన్ని ప్రభుత్వం పొందింది.

తక్కువ పన్నురేట్లను విధిస్తే.. ఎక్కువ ఆదాయం సమకూరుతుందా?

పన్ను రేట్లను తగ్గించడం వల్ల.. ఆర్థిక వృద్ధి నమోదవడమే కాదు.. ఆర్థిక వ్యవస్థపై రెట్టింపు సానుకూల ప్రభావం పడుతుందని బెంగళూరులోని బేస్​ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​, ఎన్​ఆర్​ భానుమూర్తి వంటి ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేషన్​ పన్ను వంటి ప్రత్యక్ష పన్నుల రేట్లను తగ్గిస్తే... మంచి ఫలితాలు వస్తాయనడానికి ఆధారాలు ఉన్నాయని భానుమూర్తి తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రవేశ పెట్టిన జీఎస్టీలోనూ ఈ అంశాన్ని నిర్ధరించుకోవడానికి కావాల్సిన సమాచారం లేదని ఆయన అన్నారు.

మహమ్మారి వల్ల ఎదురైన నష్టాలను ఎదుర్కోవడానికి జీఎస్టీ పన్ను వసూళ్లను తగ్గించాలని ఇప్పటికే.. ఆటోమొబైల్​, రియల్​ ఎస్టేట్​ డెవలపర్స్​ వంటి రంగాలు కోరుతున్నాయి. కానీ, జీఎస్టీ కౌన్సిల్​ మాత్రం ఈ అభ్యర్థనలను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తక్కువ పన్ను రేట్లను విధించడం వల్ల ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడి.. ఎక్కువ ఆదాయానికి మార్గం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పెద్ద పాలసీలకు పెరిగిన గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.