ETV Bharat / business

వర్క్ ఫ్రం హోంతో మహిళా ఉద్యోగుల ఇబ్బందులు!

author img

By

Published : Mar 12, 2021, 2:16 PM IST

వర్క్​ ఫ్రం హోం అంటే అనుకున్నంత సులువైన పని కాదని ఓ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలు వర్క్ ఫ్రం హోం వల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తేలింది.

Women employees on Work from home
వర్క్ ఫ్రం హోంపై మహిళా ఉద్యోగుల స్పందన

కొవిడ్​ తర్వాత ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సర్వసాధారణమైపోయింది. దాదాపు అన్ని రంగాలు వర్క్ ఫ్రం హోంను అందిపుచ్చుకున్నాయి. అయితే దీని వల్ల మహిళా ఉద్యోగులు.. అటు అఫీస్ విధులు, ఇటు ఇంటి పనులు రెండింటినీ సమతుల్యం​ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రముఖ జాబ్​ పోర్టల్​ సైకీ మార్కెట్ నెట్​వర్క్​ నిర్వహించిన సర్వేలో తేలింది.

మొత్తం 2,500 మంది మహిళా ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది. ఐటీ, ఫినాన్స్, మీడియా, హెల్త్​కేర్, ఎంటర్​టైన్మెంట్​​, మానవ వనరులు, విద్య సహా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • పురుషులతో పోలిస్తే వృత్తి​, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు 61 శాతం మంది వివరించారు.
  • ఇంటి బాధ్యతల కారణంగా వర్క్ ఫ్రం హోం తమకు కష్టంగా మారినట్లు 85 శాతం మంది తెలిపారు.
  • 81 శాతం మంది వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితాన్ని విభజించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
  • అవకాశముంటే భవిష్యత్​లోనూ వర్క్​ ఫ్రం హోంకు సిద్ధంగా ఉన్నట్లు 21 శాతం మంది పేర్కొన్నారు. 24 శాతం మంది వర్క్ ఫ్రం హోంలో తమకంటూ కొంత సమయం వెచ్చించుకోగలిగామని తెలిపారు.
  • 48 శాతం మంది వర్క్​ ప్లేస్​ ఎంచుకునే సదుపాయం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
  • కరోనా సమయంలో తమ సంస్థలు చాలా సహకరించినట్లు 36 శాతం మంది తెలిపారు. 27 శాతం మంది మాత్రం తమ సంస్థ నుంచి ఎలాంటి సహకారం అందలేదని చెప్పుకొచ్చారు.
  • ఇంటి వద్ద పనులు ఉన్నందువల్ల 65 శాతం మంది పని సమయాలు తగ్గించడం లేదా పని వేళల్లో వెసులుబాటు ఉంటే బాగుంటుందనుకున్నారు.
  • మానసిక, వ్యక్తిగత శ్రేయస్సుకోసం తమ కంపెనీలు ప్రోత్సాహకాన్ని ఇచ్చాయని 12 శాతం మంది తెలిపారు.

ఇదీ చదవండి:చదువుల ఖర్చులు తట్టుకునేలా.. సిద్ధంగా ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.