ETV Bharat / business

టిక్​టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్​ ప్రయత్నాలు!

author img

By

Published : Aug 2, 2020, 10:53 AM IST

చైనాకు చెందిన టిక్​టాక్​ను స్వాధీనం చేసుకునేందుకు టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా వ్యాపారాలను స్వాధీనం చేసుకునేందుకు టిక్​టాక్​ మాతృ సంస్థ బైట్​డ్యాన్స్​తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Microsoft in talks to acquire TikTok
టిక్​టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు

భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్​ యాప్​ అమెరికా వ్యాపారాలను టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ స్వాధీనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వార్త పత్రిక కథనం ప్రకారం ఇందుకు మైక్రోసాఫ్ట్, టిక్​టాక్​ మాతృ సంస్థ బైట్​ డ్యాన్స్​తో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ టిక్​ టిక్​ను అమెరికాలో నిషేధించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా మైక్రోసాఫ్ట్, బైట్ డ్యాన్స్​ల మధ్య చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇరు సంస్థలు శ్వేతసౌధం నుంచి స్పష్టత తీసుకున్నాకే మరోసారి చర్చలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.

నిషేధం ఎందుకు?

పౌరుల వ్యక్తిగత డేటాకు ముప్పు ఉందనే కారణాలతో టిక్​టాక్​ను భారత్ నిషేధించింది. ఇదే కారణాలతో ఇప్పుడు అమెరికా కూడా టిక్​టాక్​ను నిషేధించాలని భావిస్తోంది.

ఇదీ చూడండి:'శాంసంగ్​' యూవీ స్టెరిలైజర్​తో 10 నిమిషాల్లో క్రిములు ఖతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.