ETV Bharat / business

రిలయన్స్ వస్తే 'కిరాణం'లోనూ సంచలనమే!

author img

By

Published : May 12, 2019, 2:54 PM IST

రిలయన్స్

మన ఇంటి పక్కన ఉండే కిరాణా దుకాణం తీరే ప్రత్యేకం. అక్కడ కార్యకలాపాలన్నీ పూర్తిగా సంప్రదాయబద్ధం. ఇప్పుడిప్పుడే ఆ దుకాణాలు ఆన్​లైన్​ బాట పడుతున్నాయి. పేటీఎం వంటి వ్యాలెట్లతో చెల్లింపులు జరిపే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మరింత మార్పు రానుంది. కిరాణా దుకాణానికీ ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చే రోజు రానుంది.

జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది రిలయ్సన్​ ఇండస్ట్రీస్​. ఆన్​లైన్​ చిల్లర వర్తక రంగంలోనూ ఆ సంస్థ​ అలాంటి అద్భుతాలే సృష్టించే అవకాశముందని అంచనా వేసింది 'బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​'.

ప్రస్తుతం దేశంలో 15వేల డిజిటల్​ చిల్లర దుకాణాలు ఉన్నాయి. ఆన్​లైన్​ రిటైల్​ రంగంలోకి రిలయన్స్​ రాకతో ఆ సంఖ్య 2023 నాటికి 50లక్షలకు చేరుతుందని లెక్కగట్టింది బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్ లించ్. మరికొన్ని ఆసక్తికర అంశాలతో ఓ నివేదిక రూపొందించింది. ఆ వివరాలు...

ఎక్కువ అసంఘటితమే...

భారత్​లో 90 శాతం(దాదాపు 700 బిలియన్​ డాలర్ల) రిటైల్​ మార్కెట్​ అసంఘటితంగా ఉంది. పెరుగుతున్న పోటీ కారణంగా ఈ కిరాణా దుకాణాలు సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను అమలు తర్వాత డిజిటలీకరణ మరింత అనివార్యమైంది. జీఎస్టీ బిల్లులు ఆన్​లైన్​లో సృష్టించాల్సి ఉండడం ఇందుకు కారణం.

కిరాణా దుకాణదారుల్లో సాంకేతికత పట్ల మారుతున్న దృక్పథం రిలయన్స్​కు కలిసి వస్తుందని అంచనా వేసింది బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​.

భారీ ప్రణాళికతో...

రిలయన్స్​కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,000 రిటైల్​ స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్​లైన్​-టూ-ఆఫ్​లైన్ ఈ-కామర్స్​ వేదికను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.

కిరాణా స్టోర్లలో మొబైల్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ (ఎంపీఓఎస్​) పరికరాన్ని అమర్చాలని భావిస్తోంది రిలయన్స్​. వేగవంతమైన 4జీ అంతర్జాల సేవల ద్వారా తమ వినియోగదార్ల ఆర్డర్లును అందుకునేందుకు ఈ పరికరం దుకాణదారులకు ఉపయోగపడుతుంది.

జియోనే చౌక...

జియో ఎంపీఓఎస్​ పరికరం కోసం కిరాణా యాజమానులు ఒకసారి రూ.3,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇదే పరికరం కోసం ప్రస్తుతం స్నాప్​బిజ్​ రూ. 50,000.., నుక్కడ్ షాప్స్ రూ.30,000-రూ.55,000.., గో ఫ్రూగల్ రూ.15,000 నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నాయి.

వీటితో పోల్చుకుంటే తక్కువ ధరకే లభించే జియో ఎంపీఓఎస్​వైపే చిన్న వ్యాపారులు మొగ్గుచూపొచ్చని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​ విశ్లేషించింది.

"రిలయన్స్​ ఆన్​లైన్​ చిల్లర వర్తకంలోకి ప్రవేశిస్తే.. వ్యాపారుల అనుకూలతలు పెరుగుతాయి. ధరలు తగ్గుతాయి."
- మెరిల్​ లించ్​ నివేదిక

ఎంపీఓఎస్​పై సానుకూలం!

ఎంపీఓఎస్​పై ముంబయి, నవీ ముంబయిలోని 15 స్టోర్లలో అభిప్రాయ సేకరణ జరిపారు. వారంతా ఎంపీఓఎస్​పై సానుకూలంగా ఉన్నారని తేలింది.

తక్కువ పెట్టుబడికే లభించే ఈ వ్యవస్థతో కచ్చితమైన లాభాలు వస్తాయని వారు భావిస్తున్నట్లు బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్ నివేదిక వెల్లడించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sunal Alwin stadium, Matsumoto, Japan - 12th May 2019.
Matsutomo Yamaga (green) 0-0 Consadole Sapporo (white)
1. 00:00 Teams walking in
2. 00:06 Consadole Sapporo FC head coach Mihailo Petrovic
First half:
3. 00:10 Chance Matsumoto Yamaga: (7) Daizen Maeda right footed shot from the centre of the box is too high in 2nd minute, assisted by (4) Masaki Iida with a headed pass
4. 00:22 Replay of the chance
5. 00:32 Chance Consadole Sapporo: (4) Daiki Suga's shot bounced on (9) Musashi Suzuki's leg and the ball from very close range misses to the left in 36th minute
6. 00:46 Replay of the chance
Second half:
7. 00:59 Chance Matsutomo Yamaga: Maeda left footed shot from the left side of the box is close in 48th minute
8. 01:11 Chance Consadole Sapporo: (26) Ryota Hayasaka's shot from the centre of the box is saved in the bottom left corner in 62nd minute, assisted by (9) Musashi Suzuki
9. 01:25 Replay of the chance
10. 01:34 Chance Matstomo Yamaga: (42) Ryo Takahashi's left footed shot from a difficult angle on the left is saved in the bottom left corner in 90+1 minute
11. 01:43 Final whistle
12. 01:48 Coaches of two sides shaking hands after game
SOURCE: Lagardere Sports
DURATION: 01:54
STORYLINE:
Consadole Sapporo failed to get their fifth consecutive win after a goalless draw against 12th placed Matsumoto Yamaga in Japan's J League on Sunday, but the point does take them into sixth in the standings and just a point behind Kashima Antlers in fifth.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.