ETV Bharat / business

ఫ్లిప్​కార్ట్ కొత్త ఆఫర్​- రూ.1కే ప్రీ బుకింగ్!

author img

By

Published : Oct 9, 2020, 7:02 PM IST

Updated : Oct 9, 2020, 7:31 PM IST

త్వరలో ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది ఈ కామర్స్ దిగ్గజం. వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయి చెల్లించి ప్రీ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

Flipkart pre booking offer
ఫ్లిప్​కార్ట్ ప్రీ బుకింగ్ ఆఫర్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ వినియోగదారులకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. బిగ్ ​బిలియన్ డేస్ సేల్స్​కు ముందే.. వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను (ఎంపిక చేసిన వాటిని మాత్రమే) ప్రీ బుక్ చేసుకునే వీలు కల్పిస్తోంది.

ఆఫర్ ఎలా పని చేస్తుంది?

ఈ ఆఫర్​తో అక్టోబర్ 11-14 మధ్య.. వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయి చెల్లించి ప్రీ ఆర్డర్​ చేసుకోవచ్చు.

ఇలా ముందే బ్లాక్​ చేసుకున్న ఆర్డర్​ ధర మొత్తాన్ని 'బిగ్​ బిలియన్ డేస్​' సేల్​ ప్రారంభం అయ్యాక ఆన్​లైన్​ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్డర్​ డెలివరీ సమయంలో నగదు రూపంలో కూడా చెల్లించే వీలుంది.

ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్​ అక్టోబర్ 16 నుంచి 21 వరకు అందుబాటులో ఉండనుంది.

ప్రీ ఆర్డర్​ కోసం.. గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సహా మిలియన్ల కొద్దీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని వివరించింది ఫ్లిప్​కార్ట్.

Last Updated :Oct 9, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.