ETV Bharat / business

జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్​లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్

author img

By

Published : Dec 1, 2019, 2:04 PM IST

జీఎస్టీ వసూళ్లు నవంబర్​లో రూ.లక్ష కోట్ల మార్క్​ను తాకాయి. దేశీయంగా లావాదేవీల నుంచి జీఎస్టీ సేకరణ 12 శాతానికి పైగా పెరగటమే ఇందుకు ప్రధాన కారణం.

GST
జీఎస్టీ

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా మూడు నెలల తర్వాత.. తిరిగి నవంబర్​లో రూ.లక్ష కోట్ల మార్క్​ను అందుకన్నాయి. గత నెలలో మొత్తం రూ.1.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.

గత ఏడాది నవంబర్​తో పోలిస్తే.. గత నెలలో వసూళ్లు 6 శాతం పెరిగాయి. 2018 నవంబర్​లో జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లుగా ఉన్నాయి.

ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబర్​లో దేశీయ లావాదేవీల నుంచి 12 శాతం జీఎస్టీ వసూళ్లు పెరగటం ఇందుకు కారణంగా పేర్కొంది కేంద్రం.

నవంబర్ వసూళ్ల లెక్కలు..

  • మొత్తం జీఎస్టీ వసూళ్లు- రూ.1,03,492 కోట్లు
  • కేంద్ర జీఎస్టీ- రూ.19,592 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్టీ-రూ.27,144 కోట్లు
  • సమీకృత జీఎస్టీ-రూ.49,028 కోట్లు
  • సెస్​- రూ.7,727 కోట్లు

ఇదీ చూడండి:ఆర్బీఐ నిర్ణయాలే ఈవారం మార్కెట్లకు కీలకం!

Thiruvananthapuram (Kerala), Dec 01(ANI): Giving priority to the safety of women travelers, 'Pink Rooms' came up in Kerala which is finding many takers. Christe Jhonson from Switzerland has started 'Pink Rooms' services in Thiruvananthapuram. The services are dedicated only for the women travelers. The serviced apartments are named 'Pink Rooms'. Speaking on this Christe Jhonson said, "At 'Pink Rooms', safety of women travelers is given priority. Concept is part of woman empowerment where we have only female staff. We have made a space where women feel comfortable and safe. We give international standard professional services."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.