ETV Bharat / business

డాక్టర్​ రెడ్డీస్​కు స్పుత్నిక్​-వి టీకా విదేశీ అనుమతులు?

author img

By

Published : May 19, 2021, 1:42 PM IST

Sputnik V vaccine Drive in India
స్పుత్నిక్​ వి టీకా

భారత్​లో 'స్పుత్నిక్​-వి' టీకా ఉత్పత్తి, పంపిణీకి రష్యన్ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​తో ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్​ రెడ్డీస్​.. విదేశాల్లోనూ ఈ వ్యాక్సిన్ విక్రయ హక్కుల కోసం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు బుధవారం వెల్లడించింది.

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్​ 'స్పుత్నిక్​-వి'ను విదేశాల్లో విక్రయించే హక్కులను సాధించేందుకు రష్యన్ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​ (ఆర్​డీఐఎఫ్​)తో చర్చలు జరుపుతున్నట్లు హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ రెడ్డీస్ ప్రకటించింది. భారత్​లో 250 మిలియన్​ వయల్స్​ ఉత్పత్తి, పంపిణీ కోసం ఆర్​డీఐఎఫ్​తో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తు చేసింది.

'స్పుత్నిక్​-వి' టీకాకు భారత్​ సహా 63 దేశాల్లో వినియోగ అనుమతులు లభించినట్లు ఇటీవలే డాక్టర్​ రెడ్డీస్​ వెల్లడిచింది. ఇందులో భాగంగా మే 1న రష్యా నుంచి రెండు లక్షల 'స్పుత్నిక్​-వి' డోసులను అందుకుంది. అపోలో ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని ​వ్యాక్సిన్ డ్రైవ్​ను కూడా ప్రారంభించింది.

ఇదీ చదవండి:2 డీజీ డ్రగ్‌ను ఆవిష్కరించిన డాక్టర్‌ రెడ్డీస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.