ETV Bharat / business

భారత ఆస్తుల స్వాధీనతకు కెయిర్న్ యత్నాలు

author img

By

Published : Mar 29, 2021, 5:28 AM IST

cairn energy
భారత ఆస్తుల స్వాధీనతకు కెయిర్న్ యత్నాలు

భారత ప్రభుత్వ అధీనంలోని వివిధ ఆస్తులను జప్తు చేయించైనా సరే.. రూ.10,427 కోట్లను వెనక్కు తీసుకోవాలని కెయిర్న్​ ఎనర్జీ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు అమలు కోసం అమెరికా సహా పలు దేశాల్లో దావాలు దాఖలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం(ఆర్బిట్రేషన్​) ఇచ్చిన తీర్పు అమలు కోసం యూకేకి చెందిన కెయిర్న్​ ఎనర్జీ పీఎల్​సీ, భారత ప్రభుత్వంపై అమెరికా సహా పలు దేశాల్లో దావాలు దాఖలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. భారత ప్రభుత్వ అధీనంలోని చమురు-గ్యాస్​, నౌకాయానం, విమానాయాన, బ్యాంకింగ్​ రంగాల్లోని కంపెనీలను, విదేశాల్లోని ఆస్తుల్ని జప్తు చేయించైనా సరే.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్​ ఆదేశాలకు అనుగుణంగా రూ.10,247 కోట్లు వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది.

ఆర్బిట్రేషన్​ తీర్పు నమోదు కోరుతూ యూఎస్​, యూకే, కెనడా, ఫ్రాన్స్​, సింగపూర్​, నెదర్లాండ్స్​ సహా మరో మూడు దేశాల న్యాయస్థానాల్ని కెయిర్న్​ ఆశ్రయించింది. భారత ప్రభుత్వం మాత్రం ఆర్బిట్రేషన్​ తీర్పును సవాలు చేసేందుకు సిద్ధమైంది.

ఇదీ చూడండి:కెయిర్న్​కు భారత ఆస్తులు సీజ్ చేసే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.