ETV Bharat / business

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ నిర్వహణ రేసులో 16 బ్యాంకులు

author img

By

Published : Aug 23, 2021, 5:20 PM IST

Updated : Aug 23, 2021, 6:53 PM IST

ఎల్ఐసీ ఐపీఓ(LIC IPO)కు నిర్వహణకు దీపమ్..​ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానించగా.. అందుకు భారీ స్పందన లభించింది. దాదాపు 16 సంస్థలు (race for managing LIC IPO ) ఇందుకు ఆసక్తి కనబర్చాయి. ఇందులో ఏడు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు ఉన్నాయి.

LIC IPO merchant bankers
ఎల్​ఐసీ సన్నాహకాలు

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్​).. ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ) నిర్వహణ (LIC IPO) వ్యవహారాల కోసం దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు (bankers in race for managing LIC IPO) పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. ఎల్​ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా (Largest IPO in India) నిలవనున్న నేపథ్యంలో అటు మదుపరులతో పాటు.. మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఓ నిర్వహణపై ఆసక్తిగా ఉన్న బ్యాంకులు డిపార్ట్​మెంట్ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ అసెట్​ మేనేజ్​మెంట్​ (దీపమ్​) ఎదుట ప్రజెంటేషన్​ ఇవ్వనున్నాయి.

అంతర్జాతీయ సంస్థల జాబితా..

బీఎన్​బీ పరిబాస్​, సిటీ గ్రూప్​ గ్లోబల్​ మార్కెట్స్ ఇండియా, డీఎస్​పీ మెరిల్​ లించ్​ లిమిటెడ్ సహా ఏడు అంతర్జాతీయ బ్యాంకులు మంగళవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయని దీపమ్​ సర్క్యులర్​ ద్వారా తెలిసింది. గోల్డ్​మన్​ శాక్స్​ (ఇండియా) సెక్యూరిటీస్​, హెచ్​ఎస్​బీసీ సెక్యూరిటీస్​, క్యాపిటల్​ మార్కెట్స్​ (ఇండియా), జేపీ మోర్గాన్​ ఇండియా, నోమురా ఫినాన్షియల్​ అడ్వైజరీ, సెక్యూరిటీస్​ (ఇండియా) ఈ జాబితాలో ఉన్న మిగతా అంతర్జాతీయ దిగ్గజాలు.

దేశీయ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు..

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. ఇందులో యాక్సిస్​ క్యాపిటల్​ లిమిటెడ్​, డీఏఎం క్యాపిటల్​ అడ్వైజర్​ లిమిటెడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లిమిటెడ్​, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్​ లిమిటెడ్​ ప్రధానంగా ఉన్నాయి. జేఎం ఫినాన్షియల్ లిమెటెడ్​, కోటక్ మహీంద్రా క్యాపిటల్​ కో లిమిటెడ్​, ఎస్​బీఐ క్యాపిటల్​ మార్కెట్​ లిమిటెడ్​, ఎస్​ సెక్యూరిటీస్​ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఎల్​ఐసీ ఐపీఓ సన్నాహకాల్లో భాగంగా.. కన్సల్టింగ్‌ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్‌ - మర్చంట్‌ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి గత నెల 15న బిడ్లను ఆహ్వానించింది ఆర్థికశాఖ. ఐపీఓ ముందు కార్యాచరణ, దీపమ్‌కు సహకరించేందుకు రెండు సలహా సంస్థలను ఎంపిక చేయనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.