ETV Bharat / business

ఈ కంపెనీల్లో పని చేయడమంటే ఉద్యోగులకు ఎంతిష్టమో!

author img

By

Published : Mar 9, 2020, 11:25 AM IST

కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్నారంటే చాలా మంది పని వేళలు, ఒత్తిడి గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. ఆయా సంస్థల్లో ఇచ్చే జీతభత్యాల గురించి కూడా ప్రస్తావిస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలు చేపట్టే నూతన పాలసీ విధానం మాత్రం.. అలాంటి కబుర్లకు చోటివ్వకుండా ప్రశాంతంగా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. మరి ఆ కంపెనీల వివరాలేంటో ఓసారి చూద్దాం!

10 Companies In India With Best Working Policies For Employees
ఈ కంపెనీల్లో పని చేయడమంటే ఉద్యోగులకు ఎంతిష్ఠమో!

ఎవరైనా కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్నారంటే వారందరి మధ్య సంభాషణలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అవి పని వేళలు, షెడ్యూల్​, పని- వ్యక్తిగత జీవితం, పనిచేసే వద్ద సమస్యలు, రవాణా, ట్రావెల్​ బిల్లుల లాంటివి. ప్రతి ఉద్యోగికి.. ఉద్యోగం పట్ల గౌరవం కన్నా భయం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఉద్యోగులు స్నేహంగా మెలుగుతూ ఉత్పాదకతను పెంచేందుకు పలు కంపెనీలు సరికొత్త విధానాలు పాటిస్తున్నాయి. ఇలా ఉద్యోగుల కోసం అత్యుత్తమ పాలసీలు ఉన్న 10 కంపెనీలు, అవి ఉద్యోగులకు అందిస్తున్న వెసులుబాటులేంటో ఇప్పుడు చూద్దాం.

1.కేపీఎంజీ ఇండియా

కేపీఎంజీ ఇండియా సంస్థ తమ ఉద్యోగుల కోసం ఓ ఆసక్తికరమైన పాలసీని పెట్టింది. ఈ సంస్థ తమ ఉద్యోగులను ఎక్కడి నుంచైనా పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అది ఉద్యోగి ఇల్లయినా కావచ్చు, క్లయింట్​ కార్యాలయంలోనైనా కావచ్చు. కేపీఎంజీ కార్యాలయంలో ప్రతి రోజు హాజరుకావాలనే నిబంధనేది ఆ సంస్థ విధించలేదు. ఇలా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉత్తమ ఔట్​పుట్​ వచ్చేందుకు ప్రోత్సాహమిస్తోంది. అయితే ఇలా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఉద్యోగులందరూ వారికిచ్చిన పనిని, వారి మేనేజర్ల పర్యవేక్షణలో సకాలంలో పూర్తి చేయడం మాత్రం తప్పనిసరి.

kpmg
కేపీఎంజీ ఇండియా

2.పిలిప్స్​ ఇండియా

గురుగ్రామ్​ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ సంస్థ పిలిప్స్ ఇండియాలో పని చేసే ఉద్యోగులు ఎవరైతే సొంత వాహనాలపై వస్తారో వారి కోసం ఓ వెసులుబాటుని కల్పిస్తోంది. ఎవరికైతే ఆఫీస్​ వద్ద పార్కింగ్​కు స్థలం దొరకదో వారు ఇంటికెళ్లి అక్కడి నుంచే పని చేయొచ్చు. పార్కింగ్​ కోసం వెతుకుతూ సమయం వృథా చేయకుండా ఈ వెసులుబాటు కల్పించింది పిలిప్స్ ఇండియా.

3.కోకా కోలా

ప్రముఖ శీతలపానియాల తయారీ సంస్థ కోకా కోలా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు పని వేళలు ఫ్లెక్సిబు​ల్​గా ఉంచింది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు ట్రాఫిక్​ బారిన పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ట్రాఫిక్​ లేని సమయాల్లో ఉదయం 8:30 ప్రాంతంలో ఆఫీస్​కు వచ్చి సాయంత్రం 5:15 కు తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది.

cocacola
కోకా కోలా

4.ప్రైస్​ వాటర్​హౌస్​ కూపర్స్​ (పీడబ్ల్యూసీ)

ఉద్యోగులు సంతోషంగా ఉంటే అంత ఫలవంతంగా వారి నుంచి ఔట్​పుట్​ వస్తుందని పీడబ్ల్యూసీ నమ్ముతుంది. ఇందుకోసం ఉద్యోగులకు అనుకూలమైన పాలసీలను రూపొందించింది. ఉద్యోగులంతా తమ వ్యక్తిగత జీవితాలను, సంతృప్తికరంగా వృత్తి జీవితాన్ని అనుభవించేందుకు వీలుగా పాలసీలను తీసుకువచ్చింది.

pwc
పీడబ్ల్యూసీ

5.మైక్రోసాఫ్ట్

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్​లోని క్యాంపస్​లో వారి ఉద్యోగుల కోసం సొంత రవాణా వ్యవస్థను కలిగి ఉంది. బస్సులు, క్యాబ్​ సేవలను అందిస్తుంది. మహిళా ఉద్యోగులకు ఈ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రవాణా వ్యవస్థను కంపెనీనే స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

microsoft
మైక్రోసాఫ్ట్

6.ఫ్యూచర్​ గ్రూప్​..

బిగ్​బజార్​, సెంట్రల్​, బ్రాండ్ ఫ్యాక్టరీ లాంటి రిటైల్ మార్కెట్లను నిర్వహిస్తున్న సంస్థ ఈ ఫ్యూచర్​ గ్రూప్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఇక్కడ పని చేసే ఉద్యోగుల కోసం ఓ సరికొత్త పాలసీని పాటిస్తోంది. ముంబయిలో ట్రాఫిక్ సమస్య గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగులు ఉదయం 8:30 నుంచి 10:30 మధ్య ఎప్పుడైనా వచ్చే వీలు కల్పించింది. ఆ తర్వాత 8 గంటల పని సమయం ముగిసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పిస్తోంది.

futuregroup
ఫ్యూచర్​ గ్రూప్

7.ఎస్​ఏపీ ల్యాబ్స్​

బెంగళూరులో ఉన్న ఎస్​ఏపీ ల్యాబ్స్​లో పని వేళలు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటాయి. ఎంత సమయం ఉన్నామనేది కాదు పని ఎంత బాగా జరిగింది అనే విషయానికి ఈ కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు ఎప్పుడైనా వచ్చి పని పూర్తయ్యాక వెళ్లేందుకు అనుమతిస్తోంది. అదేవిధంగా వారంలో ఒక రోజు ఇంటి నుంచే పని చేసుకునేందుకు ఈ సంస్థ వీలు కల్పిస్తోంది.

sap
ఎస్​ఏపీ ల్యాబ్స్​

8.ఇన్ఫోసిస్​

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​ బెంగళూరు క్యాంపస్​లోని ఉద్యోగులను ఈకో ఫ్రెండ్లీ రవాణాను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం సైకిల్​పై ఆఫీస్​కు వచ్చేలా ప్రేరణ కల్పిస్తుంది. దీని ద్వారా కాలుష్యం తగ్గించడం సహా ఖర్చూ తక్కువవుతుందని ఇన్ఫీ భావిస్తోంది.

infy
ఇన్ఫోసిస్​

9.బాకార్డీ ఇండియా

బాకార్డీ ఇండియా.. ఉద్యోగులకు అనుకూలమైన పని వేళల పాలసీలను కలిగి ఉంది. ఉద్యోగులను తృప్తిగా ఉంచితే సరైన ఉత్పాదకత దక్కుతుందని ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఉద్యోగులు వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని రెండింటినీ ఆస్వాదించేలా పని వేళలను పాటిస్తుంది. ఇంటి నుంచి పని చేసుకునే వీలునూ కల్పిస్తోంది.

bacardi
బాకార్డీ ఇండియా

10.అమెరికన్ ఎక్స్​ప్రెస్​

గురుగ్రామ్​లో వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెరికన్ ఎక్స్​ప్రెస్​ సంస్థ ఉద్యోగులను ప్రజా రవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. కాలుష్యం సహా ఖర్చు తగ్గించుకునేందుకు ఇలాంటి పాలసీలను తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రతి మంగళవారం అందరూ ప్రజా రవాణాను వినియోగించుకునేలా "కార్​ ఫ్రీ డే"ను నిర్వహిస్తోంది.

amex
అమెరికన్ ఎక్స్​ప్రెస్​

దేశంలో ఉద్యోగులకు ప్రాధాన్యతనిచ్చేలా పాలసీలు తీసుకువచ్చిన కొన్ని కంపెనీల జాబితా ఇది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇలాంటి పాలసీలను తీసుకువస్తాయని ఆశిద్దాం.

ఇదీ చూడండి:బ్యాంకుల్లో మీ డబ్బు భద్రంగా ఉంది: ఆర్బీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.