ETV Bharat / business

'దుస్తులపై జీఎస్​టీ యథాతథం.. పాదరక్షలపై భారీగా పెంపు'

author img

By

Published : Dec 31, 2021, 1:49 PM IST

Updated : Dec 31, 2021, 4:33 PM IST

GST on Textiles: 46వ జీఎస్​టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుస్తులపై జీఎస్​టీ పెంపును నిలిపివేశారు. దుస్తులపై 12శాతం జీఎస్​టీ పెంపు ప్రతిపాదనకు పలు రాష్ట్రా విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

GST Council meeting
GST Council meeting

GST On Textiles: దుస్తులపై వస్తు, సేవల పన్నును(జీఎస్‌టీ) 12 శాతం పెంచాలన్న ప్రతిపాదనపై జీఎస్​టీ మండలి వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్​టీనే కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన​ 46వ జీఎస్​టీ మండలి సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల అభ్యర్థన మేరకు దుస్తులపై జీఎస్​టీని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే వస్త్రాలపై జీఎస్‌టీ రేటు అంశాన్ని పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి పంపుతామని.. అది 2022 ఫిబ్రవరి నివేదిక సమర్పిస్తుందని సీతారామన్​ వెల్లడించారు.

"దుస్తులపై జీఎస్​టీ రేటును 12 శాతానికి పెంచకూడదని.. ప్రసుత్తం ఉన్న 5 శాతాన్నే కొనసాగించాలని జీఎస్​టీ మండలి సమావేశంలో నిర్ణయించాం. వస్త్రాలపై జీఎస్‌టీ రేటు అంశాన్ని పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి పంపుతాం. అది ఫిబ్రవరిలోగా తన నివేదికను సమర్పిస్తుంది."

- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

పాదరక్షలపై తగ్గేదేలే

అయితే పాదరక్షలపై జీఎస్​టీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్న రాష్ట్రాలు డిమాండ్​ను అంగీకరించలేదని సీతారామన్​ స్పష్టం చేశారు. ఫలితంగా ధరలతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలపై 5 నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్​టీ జవనరి 1 నుంచి అమల్లోకి రానుంది.

ఒక్క రోజు ముందు...

ఇటీవల చెప్పులు, దుస్తులపై 5 శాతం ఉన్న జీఎస్‌టీని 12శాతానికి పెంచారు. ఈ రేట్లు 2022 జనవరి 1న అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేట్లు పెంచడం వల్ల చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో దుస్తులపై పన్ను పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మ్యాన్​ మేడ్​ ఫైబర్​పై(ఎంఎంఎఫ్​) పన్ను రేటు 18 శాతం, ఎంఎంఎఫ్​ నూలుపై 12 శాతం, దుస్తులపై 5 శాతం పన్ను విధిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రపంచ దిగ్గజ బ్యాటరీ సంస్థ.. ఇప్పుడు రిలయన్స్​ సొంతం

Last Updated : Dec 31, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.