ETV Bharat / business

కరోనాను చంపే 'స్మార్ట్​ఫోన్​ సోప్'​ గురించి తెలుసా?

author img

By

Published : Mar 16, 2020, 6:41 AM IST

Updated : Mar 16, 2020, 9:21 AM IST

వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటే కరోనా సోకే అవకాశాలు లేవని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగత అవసరాల్లో స్మార్ట్​ఫోన్​ తప్పని సరిగా మారింది. స్మార్ట్​ఫోన్​లను ఇతర వస్తువుల్లాగా కడగటం కుదరదు. ప్రత్యేక డివైజ్​ ద్వారా శుభ్రం చేయాలి. ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎలా వాడాలి?

Smartphone Soap
స్మార్ట్​ఫోన్​ సోప్

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే వార్తలు.. కరోనా రాకుండా తరచూ చేతులు కడుక్కోండి. ఎక్కడికెళ్లినా హైజిన్​గా ఉండండి అంటూ ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే మనం ఎక్కడికెళ్లినా.. ఏం చేస్తున్నా మనతో పాటు ఇప్పుడు స్మార్ట్​ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది.

ఎక్కడ పడితే అక్కడ ఫోన్ వాడుతున్నాం. ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడెక్కడో ఫోన్​ను పెడుతుంటాం. కానీ ఒక్క సారి కూడా ఫోన్​ను కడగం. ఎందుకంటే ఫోన్​ను కడిగితే అవి పని చేయకుండా పోతాయి. మరి ఇలాంటి సమయాల్లో ఫోన్లపై ఎంత దుమ్ము, వైరస్​లు ఉంటాయో? ఎప్పుడైనా ఆలోచించారా? వాటి ద్వారా వైరస్​లు వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేవు. మరి దీనికి పరిష్కారం ఉందా? అవును ఇందుకు ఓ పరిష్కారం ఉంది. అదే 'స్మార్ట్​ఫోన్​ సోప్'​.

ఈ సబ్బుతో ఫోన్లో ఉన్న వైరస్​, దుమ్ము 99.9 శాతం పోతుంది. సబ్బు వాడితే ఫోన్ పని చేస్తుందా? అనేగా మీ సందేహం.. అలాంటిదేమీ ఉండదు ఇది పేరుకే సబ్బుకాని నిజమైన సబ్పుకాదు. ఫోన్లను దుమ్ము ధూళి సహా వైరస్​ (భౌతిక) నుంచి రక్షించేందుకు ఉన్న ఓ సదుపాయం. అతినీలలోహిత (యూవీ)కిరణాల ద్వారా ఫోన్లలో ఉండే వైరస్​ను తొలిగిస్తుంది.

దీన్ని ఎలా వాడాలి?

దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ ​సోప్ డివైజ్​లో స్మార్ట్​ఫోన్ పెట్టేందుకు ఓ కంపార్ట్​మెంట్​ ఉంటుంది. దీనికి ఓ చివర ఛార్జింగ్ కేబుల్​ ఉంటుంది. మీరు పడుకునే ముందు మీ ఫోన్​ను ఆ బాక్సులో ఉంచి.. ఛార్జింగ్ కేబుల్​​ను మీ ఛార్జర్​కు కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత బాక్సుకు లైటింగ్​ లోగోతో ఉన్న బటన్​ను నొక్కాలి. దీనితో మీ ఫోన్​ ఛార్జింగ్ అవ్వడం సహా.. అందులో ఉన్న వైరస్​ కూడా పూర్తిగా చనిపోతుంది.

ఫోన్​లో బ్యాక్టీరియా చనిపోవడమేంటి?

చాలా మందికి ఈ బాక్సును చూస్తే ఒక అనుమానం వస్తుంది. ఈ బాక్సు వైరస్​ను ఎలా చంపుతుంది? ఫోన్​ను ఎలా శుభ్రం చేస్తుంది? అని. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఆ బాక్సును అందిస్తున్న సంస్థ అధికారిక వైబ్​సైట్లో ఉంచింది.

అందులో ఉన్న సమాచారం ప్రకారం.. అతినీలలోహిత కిరణాల్లో మూడు రకాలు ఉన్నాయి అవి... యూవీ-ఏ, యూవీ-బీ, యూవీ-సీ. యూవీ-ఏ, యూవీ-బీలు.. యూవీసీ తో పోలిస్తే పొడవైన వేవ్​లెంగ్త్​ కలిగి ఉంటాయి. ఈ కారణంగా యూవీ-సీకి క్రిములు, వైరస్​లను చంపే శక్తి వచ్చింది.

యూవీ-సీ కిరణాలు మానుషులకూ ప్రమాదకరమే. ఈ కిరణాలు భూమిని చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఇలాంటి కిరణాలను ఫోన్​సోప్​లో వాడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఫోన్​సోప్​లో 6,500 ఎంఏహెచ్​ బ్యాటరీని అమర్చారు. ఇది పూర్తిగా నిండేందుకు 4.5 గంటలు పడుతుంది. ఇది ఒక స్మార్ట్​ఫోన్​ను 2-4 సార్లు ఛార్జ్​ చేస్తుంది. డిస్​ఇన్​ఫెక్షన్ ప్రక్రియ 45 నిమిషాలపాటు జరుగుతుంది.

ఈ డివైజ్ వెనకాల యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ టైప్​ (ఇన్​, అవుట్) పోర్టులు ఉంటాయి.

ఫోన్​సోప్ ధర ప్రస్తుతం 79.95 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.5,900 పైమాటే.

ఇదీ చదవండి: 'కరోనా రావద్దంటే స్మార్ట్​ఫోన్​నూ కడగాల్సిందే'

Last Updated : Mar 16, 2020, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.