ETV Bharat / business

భారత్​లో 10 కోట్ల స్పుత్నిక్​-వీ టీకాల ఉత్పత్తి

author img

By

Published : Nov 27, 2020, 1:52 PM IST

స్పుత్నిక్​-వీ టీకా 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు రష్యన్‌ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్​తో భారత్​కు​ చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో ఒప్పందం కుదుర్చుకుంది. 2021 ప్రారంభంలో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టనున్నట్లు రష్యా పేర్కొంది.

RDIF, Hetero ink pact to produce 100 Mn doses of Sputnik V vaccine in India
భారత్​లో 100మిలియన్​ డోసుల స్పుత్నిక్​-వీ టీకాలు!

భారత్​లో 100 మిలియన్​ డోసుల స్పుత్నిక్-వీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు రష్యన్‌ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్(ఆర్డీఐఎఫ్​), ప్రముఖ ఫార్మాసంస్థ హెటిరోతో ఒప్పందం చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ డోసుల ఉత్పత్తి చేసేలా ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. 2021 మొదట్లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ టీకాపై బెలారస్, యూఏఈ, వెనిజువెలా సహా పలు దేశాల్లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.