ETV Bharat / business

కరెంటు​ ఖాతా నిబంధనలు కఠినతరం చేసిన ఆర్బీఐ

author img

By

Published : Aug 8, 2020, 1:48 PM IST

కరెంటు ఖాతా తెరిచే నిబంధనలను కఠినతరం చేసింది ఆర్బీఐ. క్యాష్ క్రెడిట్​, ఓవప్​డ్రాఫ్ట్ సదుపాయాలతో రుణాలు పొందినవారికి కొత్త ఖాతాలు తెరవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రుణగ్రహీతల రుణ క్రమశిక్షణను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

RBI tightens rules for opening new current accounts
కరెంటు ఖాతా నిబంధనలు కఠినతరం చేసిన ఆర్బీఐ

వాణిజ్య బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు తెరవడానికి పలు ఆంక్షలు విధించింది ఆర్బీఐ. రుణగ్రహీతల్లో రుణ క్రమశిక్షణను బలోపేతం చేయడానికి, నిధుల మళ్లింపును నివారించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం వెల్లడించింది.

రుణ గ్రహీతలు బహుళ ఖాతాలు నిర్వహిస్తూ పలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారని, అందుకే భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తెలిపారు. ఒక్కసారి బ్యాంకు ద్వారా క్యాష్ క్రెడిట్​/ ఓవర్​ డ్రాప్ట్ రుణ సదుపాయాలు పొందిన వారికి మరో కరెంటు ఖాతా తెరవకూడదని అన్ని బ్యాంకులను ఆదేశించారు.

కంపెనీలు, వ్యాపారాలు నిర్వహించే వారు రోజువారి లాావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగించేదే కరెంటు ఖాాతా. దీనిలో లావాదేవీలకు పరిమితులు ఉండవు. క్యాష్ క్రెడిట్​, ఓవర్​ డ్రాఫ్ట్ సదుపాయాలుంటాయి. ఒక్కోసారి ఖాతాలో బ్యాలెన్స్​ లేకున్నా నగదు విత్​డ్రా చేసుకోవచ్చు. దీనినే ఓవర్​డ్రాఫ్ట్​ అంటారు.

ఇదీ చూడండి:మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.