ETV Bharat / business

Fuel Price Today: సామాన్యుడికి 'పెట్రో' సెగ - మళ్లీ పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Nov 1, 2021, 7:18 AM IST

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 36 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

petrol
Fuel Price Today: మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో 'పెట్రో'​ బాదుడు కొనసాగుతోంది. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, లీటర్​ డీజిల్​పై 36 పైసలు పెంచుతూ (Fuel price Today) చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.109.71కు చేరగా.. డీజిల్​ ధర రూ.98.44కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 36 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.115.47కు చేరగా.. లీటర్​ డీజిల్ 39 పైసలు పెరిగి​​ రూ.106.59 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Petrol Price) ధర 37 పైసలు పెరిగి రూ.110.12గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.101.53 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 32 పైసలు పెరిగి (Chennai Petrol Price) రూ.106.33 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు రూ.102.57కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలో చమురు ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్​పై 41 పైసలు, డీజిల్​పై 42 పైసలు పెరిగాయి.

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర రూ.114.09కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్​ ధర రూ.106.95గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.116.06కి చేరింది. డీజిల్​పై ధర​ లీటర్ రూ.108.71 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.114.76 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.107.45కి చేరింది.

ఇదీ చూడండి : ఈపీఎఫ్​ఓ యూఏఎన్​ నెంబరు మర్చిపోయారా? అయితే ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.