ETV Bharat / business

Stock Market: ఆర్థిక గణాంకాలు, కరోనా కొత్త వేరియంట్​ వార్తలే కీలకం!

author img

By

Published : Nov 28, 2021, 12:47 PM IST

గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై (Stock Market news) బేర్​ పంజా విసిరింది. సూచీలు భారీగా పతనమయ్యాయి. మరి ఈ వారం మార్కెట్ల పోకడ ఎలా ఉండనుంది? ఏఏ అంశాలు ప్రభావం చూపనున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?

Stock Market outlook
ఈవారం స్టాక్ మార్కెట్లు

కరోనా కొత్త వేరియంట్​ వార్తలు ఈ వారం దేశీయ స్టాక్​ మార్కెట్లను(Stock Market Outlook) ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక గణాంకాలు, వాహన అమ్మకాలపై కూడా మదుపరులు దృష్టిసారించే అవకాశముందని తెలిపారు.

"కొవిడ్​ కొత్త వేరియంట్(omicron variant news)​, విదేశీ సంస్థగత మదుపరుల ప్రవర్తనతో పాటు ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. కరోనా సంబంధిత పరిణామాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. కొత్త వేరియంట్​పై పలు టీకాల సమర్థత మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయి. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విధించే ఆంక్షలకు సంబంధించిన వార్తలు సూచీలను అస్థిర పరుస్తాయి."

- సంతోష్ మీనా, స్వస్తికా ఇన్వెస్ట్​మెంట్ లిమిటెడ్

ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం సహా నవంబరు నెలలో వాహన అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని సామ్కో సెక్యూరిటీస్​ హెడ్​ యేషా షా పేర్కొన్నారు. తయారీ, సేవా రంగాల పర్చేజింగ్​ మేనేజర్స్​ సూచీ(పీఎంఐ) సైతం మార్కెట్లపై(stock market outlook this week) ప్రభావం చూపవచ్చు.

భారతీయ రిజర్వు బ్యాంకు విధానాలు, ద్రవ్యోల్బణ డేటా మార్కెట్​కు కీలకం కానున్నాయని కొటక్​ సెక్యూరిటీస్​ హెడ్​(రిటైల్) శ్రీకాంత్​ చౌహాన్​ తెలిపారు.

ఒక్కవారంలోనే సెన్సెక్స్​ 4.42 శాతం డౌన్​

గడిచిన వారం స్టాక్​ మార్కెట్లను(Stock market news update) కరోనా భయాలు కుదిపేశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్(bse sensex)​ 4.24 శాతం నష్టంతో 2,528.86 పాయింట్లు క్షీణించింది. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్​ 1,688 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 510 పాయింట్ల మేర నష్టపోయాయి.

దేశంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ కొవిడ్​ కేసుల్లో పెరుగుదలతో పాటు దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్(omicron variant news)​ బయటపడటం మదుపర్ల సెంటిమెంట్​ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ కొత్త వేరియంట్​(బి.1.1.529 వేరియంట్​).. అత్యంత ప్రమాదకరమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకం వైరస్​పై టీకా ప్రభావం కూడా తక్కువేనని తెలుస్తోంది. ఇదే వేరియంట్​ను బోట్సవానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ గుర్తించారు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు కుప్పకూలాయి. ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకోవడం సూచీలు కుదేలయ్యాయి.

ఇవీ చూడండి:

'ఆర్థిక వ్యవస్థలో సంఘటిత రంగానిదే ప్రధాన పాత్ర'

IT Recruitment: 'ఫ్రెషర్స్‌' కోసం ఐటీ సంస్థల మధ్య పోటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.