ETV Bharat / business

LIC Revival Campaign: రద్దయిన ఎల్‌ఐసీ పాలసీలకు జీవం

author img

By

Published : Aug 24, 2021, 10:56 AM IST

ల్యాప్స్​ అయిన పాలసీలను పునరుద్దరించుకునేందుకు (campaign for revival of lapsed policies) భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ) మరో అవకాశం ఇచ్చింది. స్పెషల్​ రివైవల్​ క్యాంపెయిన్​ (Special Revival Campaign) పేరుతో తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని రెండు నెలల పాటు వినియోగించుకునేందుకు వీలుంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

LIC campaign for revival of lapsed policies
ఎల్​ఐసీ పాలసీ రివైవల్ఆ ఫర్​

ప్రీమియం చెల్లించనందున, రద్దయిన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు (campaign for revival of lapsed policies) భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. 'స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌ (Special Revival Campaign)' పేరుతో దీన్ని ఆగస్టు 23న ప్రారంభించింది. అక్టోబరు 22 వరకు ఇది కొనసాగుతుందని ఎల్‌ఐసీ వెల్లడించింది.

గత అయిదేళ్లుగా ప్రీమియం చెల్లించకుండా ఉన్న పాలసీలను పునరుద్ధరణ చేసుకునేందుకు ఈ పథకంలో వీలవుతుందని ఎల్‌ఐసీ వివరించింది. ప్రీమియం చెల్లింపునకు వీలుండి, ఇంకా వ్యవధి ఉన్న పాలసీలను కొన్ని నిబంధనల మేరకు తిరిగి అమల్లోకి తీసుకురావచ్చు. చెల్లించాల్సిన ప్రీమియాలకు ఆలస్యపు రుసుములో కొంత రాయితీ (offering concessions in late fee) ఇస్తున్నట్లు ఎల్‌ఐసీ పేర్కొంది. టర్మ్‌ పాలసీలకు, అధిక రిస్కు ఉన్న పాలసీలకు ఈ రాయితీ వర్తించదు. ఆరోగ్య పరీక్షల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు.

రాయితీలు ఇలా..

రూ.లక్ష లోపు ప్రీమియం చెల్లించే వారికి ఆలస్యపు రుసుములో 20శాతం (గరిష్ఠంగా రూ.2,000) రాయితీ లభిస్తుంది. రూ.1- 3లక్షల లోపు ప్రీమియం ఉంటే 25 శాతం గరిష్ఠంగా రూ.2,500 వరకు ఆలస్యపు రుసుము తగ్గుతుంది. రూ.3లక్షలు, ఆపైన ప్రీమియానికి వర్తించే ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్ఠంగా రూ.3 వేల వరకు రాయితీ ఉంటుందని తెలిపింది. అనివార్య కారణాల వల్ల ప్రీమియాన్ని సకాలంలో చెల్లించని పాలసీదారులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ పునరద్ధరణ పథకం తోడ్పడుతుందని ఎల్‌ఐసీ పేర్కొంది.

ఇదీ చదవండి: LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ నిర్వహణ రేసులో 16 బ్యాంకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.