ETV Bharat / business

భారత్​లో తగ్గిన ఇంధన డిమాండ్​.. కారణం అదే...

author img

By

Published : Mar 19, 2020, 7:40 PM IST

దేశంలో ఇంధన డిమాండ్​ తగ్గిపోయిందని భారతీయ చమురు సంస్థ (ఐఓసీ) వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని పేర్కొంది. మార్చి తొలి రెండువారాల్లో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్​ 10శాతం తగ్గిపోయిందని నివేదించింది ఐఓసీ.

India's fuel demand drops 11 pc in March as Covid-19 hits aviation, transport sectors
భారత్​లో తగ్గిన ఇంధన డిమాండ్

కరోనా దెబ్బకు దేశంలో ఇంధన డిమాండ్​ పడిపోయిందని భారతీయ చమురు సంస్థ(ఐఓసీ) తెలిపింది. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించింది.

ఇప్పటికే దేశంలో చాలా విమానాలు రద్దయిపోయాయి. పరిశ్రమలల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ఆగిపోయాయి. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో 10 నుంచి 11శాతం ఇంధన వినియోగం తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది.

గతేడాది ఇదే నెలలో 19.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 మార్చి తొలి రెండువారాల్లో 10మిలియన్​ టన్నుల ఇంధనాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో గతేడాదితో పోల్చితే ఈసారి డిమాండ్​ తగ్గింది.

"కరోనా ప్రభావంతో ప్రెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్​ తగ్గిపోయింది. మార్చి తొలి పక్షంలో ద్రవ ఇంధనానికి 10 నుంచి 11శాతం డిమాండ్ క్షీణించింది. ప్రయాణ ఆంక్షల కారణంగానే ఇంధనాల అమ్మకాలు తగ్గాయి. పారిశ్రామిక కార్యకలాపాల మందగమనం కూడా డిమాండ్​ తగ్గడానికి ఒక కారణం."

-భారతీయ చమురు సంస్థ

క్రిసెల్​ ఏం చెబుతోంది?

"పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోయాయి. మొత్తం చమురు వినియోగంలో విమానాల వాటా 6 నుంచి 8శాతం వరకు ఉంటుంది. వైరస్​ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పలు దేశాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఫలితంగా డీజిల్​ 13శాతం, జెట్​ ఇంధనం 10శాతం, పెట్రోల్​ 2శాతం అమ్మకాలు క్షీణించాయి. వైరస్​ తీవ్రత అధికమైతే రానున్న రెండు, మూడు నెలల్లో పర్యవసానాలు ఊహించని విధంగా ఉంటాయి" అని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసెల్ పేర్కొంది.

"భారత్​ రానున్న రోజుల్లో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసే అవకాశముంది. ఫలితంగా 2021లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2 నుంచి 3 శాతానికి తగ్గిపోవచ్చు" అని తెలిపింది క్రిసెల్.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్​ ఇంధన డిమాండ్​ 5శాతానికి తగ్గిపోనుందని అమెరికాకు చెందిన ఫైనాన్సింగ్​ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.

ఇదీచూడండి: 3.8 కోట్ల మంది పర్యటక ఉద్యోగులకు కరోనా సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.