ETV Bharat / business

ఐటీ ఈ-ఫైలింగ్​ ఖాతా హ్యాక్ అయిందా?

author img

By

Published : Apr 8, 2020, 3:17 PM IST

I-T Dept cautions against breach in e-filing accounts
ఈ-ఫైలింగ్​ ఖాతాల హ్యాకింగ్​పై ఐటీ శాఖ హెచ్చరిక!

ఈ-ఫైలింగ్ ఖాతాల హ్యాకింగ్​పై పన్ను చెల్లింపుదారులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది ఆదాయపన్ను శాఖ. తమ ఖాతాలు అనధికారికంగా యాక్సెస్​ అయినట్లు గుర్తిస్తే సైబర్​ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించింది.

పన్ను చెల్లింపుదారులు తమ వ్యక్తిగత ఈ-ఫైలింగ్​ ఖాతాలు హ్యాకింగ్​కు గురికాకుండా జాగ్రత్త వహించాలని కోరింది ఆదాయపన్ను శాఖ. ఏమైనా అనుమానాస్పద చర్యలను గుర్తిస్తే వెంటనే సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

" ఒకవేళ మీ ఈ-ఫైలింగ్​ ఖాతాను అక్రమంగా యాక్సెస్​ చేస్తున్నట్లు అనిపిస్తే.. మీరు సైబర్​ క్రైమ్​ బాధితులే. అలాంటి పరిస్థితి తలెత్తితే మొదటగా సంబంధిత పోలీసులు లేదా సైబర్​ సెల్​కు ఫిర్యాదు చేయాలి. https://cybercrime.gov.in/ వెబ్​సైట్​లోకి వెళ్లి ఆన్​లైన్​ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఖాతాల లాగిన్​ ఐడీల వంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దు. "

- ఆదాయ పన్ను శాఖ.

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న సమయంలో ఆన్​లైన్​ వ్యవస్థలపై దాడులు పెరుగుతున్నందున ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనా దెబ్బకు 19.5 కోట్ల ఉద్యోగాలు మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.