ETV Bharat / business

ఏసీలు కొంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే

author img

By

Published : Mar 11, 2020, 7:03 AM IST

ఎండాకాలం వచ్చేసింది. ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చుందామంటే ఉక్కపోత. వీటన్నింటి నుంచి ఉపశమనం కోసం చాలా మంది ఏసీలు కొనాలని ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.

How to buy the right air conditioner
ఎసీ కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎసీలు కొంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఏసీల కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే ఎలాంటి ఏసీ తీసుకోవాలి? ఎంత సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది? ఇతర విషయాలేమైనా పరిగణనలోకి తీసుకోవాలా? అన్న దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ముందుగా వాటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి.

కరెంటు బిల్లు ముఖ్యం..

ఏసీని ఉపయోగించినట్లయితే నెలవారీ కరెంటు బిల్లు భారీగా పెరుగుతుంది. అందుకే తక్కువ విద్యుత్​తో నడిచే ఏసీని ఎంచుకోవటం ఉత్తమం. ఏసీ ఉపయోగించే విద్యుత్ కోసం స్టార్ రేటింగ్ ఉపయోగపడుతుంది. మార్కెట్​లో 1 స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్​లో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ విద్యుత్ వినియోగించుకుంటుంది.

మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి స్టార్ రేటింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి సాధారణ రేటింగ్ ఉన్న ఏసీల కంటే తక్కువ విద్యుత్ బిల్లునిస్తాయి. సాధారణ 5 స్టార్ రేటింగ్ తో ఉన్న ఏసీ కంటే 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ తక్కువ బిల్లునిస్తుంది.

ఎంత సామర్థ్యం ఉన్న ఏసీ కావాలి?

గదికి తగ్గ ఏసీని ఎంచుకోవటం వల్ల కూడా కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. పెద్ద గదిలో చిన్న ఏసీ ఉంచినట్లయితే చల్లదనం సరిపోదు. చిన్న గదిలో పెద్ద ఏసీని ఉంచటం వల్ల చలి ఎక్కువగా పెట్టటమే కాకుండా... జేబుకు చిల్లు పడుతుంది.

గదికి తగ్గ ఏసీలు..

సాధారణంగా 1 టన్​ ఏసీ.. 100 నుంచి 120 చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న గదికి సరిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. 175 చదరపు అడుగులు ఉన్న గదికి 1.5 టన్ ఏసీ కావాల్సి ఉంటుంది.

ఈ విషయాలు పరిగణించండి?

ఏసీ కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ధరున్నప్పటికీ... అల్యూమినియం కాపర్ కండెన్సర్ ఉన్న ఏసీలు మంచిగా పనిచేస్తాయి. దీనితో పాటు ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా పనిచేయటం, తదితర అంశాలను చూడాల్సి ఉంటుంది.

ఏసీ చేసే ధ్వనిని కూడా పరిగణించాలి. స్పిట్ ఏసీలు సాధారణంగా శబ్ధం తక్కువ చేస్తాయి. విండో ఏసీ కొన్నిసార్లు కొంచెం ఎక్కువ శబ్ధాన్ని చేస్తాయి. మంచి సర్వీస్ అందించే కంపెనీల ఏసీలను ఎంచుకోవటం ఉత్తమం.

ఇదీ చూడండి:అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్​మా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.