ETV Bharat / business

మార్చి, ఏప్రిల్​ జీఎస్​టీఆర్​-3బీపై ఆలస్య రుసుము రద్దు

author img

By

Published : May 2, 2021, 12:20 PM IST

GSTR-3B, late fee
మార్చి, ఏప్రిల్​ జీఎస్​టీఆర్​-3బీపై ఆలస్య రుసుము రద్దు

మార్చి, ఏప్రిల్​ నెలల్లో దాఖలు చేయాల్సిన జీఎస్​టీఆర్​-3బీపై ఆలస్య రుసుమును కేంద్రం రద్దు చేసింది. అలాగే చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీరేట్లును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

మార్చి, ఏప్రిల్​ నెలలకు సంబంధించి నెలవారీగా దాఖలు చేసే జీఎస్​టీఆర్​-3బీ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుమును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీరేటును కూడా తగ్గించినట్లు తెలిపింది.

రూ.5కోట్ల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జీఎస్​టీఆర్-3బీని దాఖలు చేయడానికి 15 రోజుల అదనపు సమయాన్ని ఇచ్చింది. సాధారణంగా అయితే ఈ పక్షం రోజులకు 9శాతం ఆలస్య రుసుముని కేంద్రం వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ పై 18శాతం ఆలస్య రుసుమును కట్టాల్సి ఉంటుంది.

అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ను కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) విడుదల చేసింది. తాజాగా తీసుకున్న పన్ను మినహాయిపులు ఏప్రిల్​ 18 నుంచి చేసిన వాటికి వర్తిస్థాయని తెలిపింది. ఏప్రిల్ సేల్స్ రిటర్న్ జీఎస్​టీఆర్​-1ను దాఖలు చేయవలసిన తేదీని మే 26 వరకు పొడిగించారు.

ఇదీ చూడండి: ఐటీఆర్​ దాఖలుకు గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.